మంచు ఫ్యామిలీ మధ్య కొట్లాట రోడ్డుకెక్కింది. మంగళవారం జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ బాబుపై BNS సెక్షన్ 118 (1) కేసు నమోదు చేశారు పోలీసులు. విధినిర్వహణలో ఉన్న రిపోర్టర్ రంజిత్‌పై మోహన్‌బాబు దాడిచేశారని.. ఉద్దేశపూర్వకంగా రంజిత్ మైకు, ఫోన్ లాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రిపోర్టర్‌ను దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ.. స్టీల్‌పైప్, మెటల్ లోగో ఉన్న మైకుతో భౌతికదాడికి పాల్పడ్డట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మోహన్‌బాబు వ్యవహార శైలిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. Also Read : మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్ పద్మశ్రీ రద్దు చేయాలి.. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని పౌర సమాజం ఖండిస్తోంది. మోహన్‌బాబు, మంచు విష్ణుపై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మోహన్‌బాబుకు ప్రకటించిన.. పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. కాగా గతంలో ఇదే బ్రహ్మణులపై మోహన్‌బాబు, విష్ణు దాడి చేయడం గమనార్హం. Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!