మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి. మోహన్ బాబు, అతని చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గతకొన్ని రోజులు వైరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకునే కానుంచి బౌన్సర్లను తీసుకొని ఇళ్ల మీదకు వెళ్లి దాడి చేసుకునే దాకా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తగాదాలు వెళ్లాయి. ఇక మంగళవారం రాత్రి మాత్రం పెద్ద గొడవే జరిగింది. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ రావడం, గేట్ల మూసేసరికి వాటిని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లడం, ఆ తర్వాత ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడం.. అన్నీ జరిగిపోయాయి. ఇప్పటికే ఈ గొడవ వల్ల మోహన్ బాబు భార్య ఆసుపత్రిలో చేరగా.. ఇప్పుడు మోహన్ బాబు సైతం హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. That's #Mohanbabu's true personality finally caught on camera. Sadly that journalist seems to have suffered many fractures between eye and ears, and he'll face music for that assault legally now. https://t.co/3ecPMc9jel — Anirudh J 🇮🇳 (@Anirudhj12) December 10, 2024 Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్! మోహన్ బాబు హైబీపీ, గుండెలో నొప్పి సమస్యతో గచ్చిబౌలిలోనూ కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి జరిగిన గొడవలో మీడియాపై ఫైర్ అయిన ఆయనకు ఒక్కసారిగా హై బీపీ రావడంతో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మోహన్ బాబు చికిత్స తీసుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబుతో పాటు పెద్ద కొడుకు మంచు విష్ణు ఉన్నాడు. మోహన్ బాబుపై కేసు నమోదు.. మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన్న ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. వాళ్ళను బూతులు తిడుతూ ఓ రిపోర్టర్ ని కొట్టాడు. దీంతో సదరు మీడియా ఛానెల్ ఆయనపై ఫిర్యాదు చేయగా.. పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం