మంచు ఫ్యామిలీలో మళ్లీ రగడ మొదలైంది. జల్‌పల్లి నివాసంలోని మంచు మనోజ్, విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగింది. మనోజ్ ఇంటికి చెందిన జనరేటర్‌లో విష్ణు పంచదార పోయించడం మరోసారి చర్చనీయాంశమవుతోంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మనోజ్.. పహాడీషరీఫ్ పీఎస్‌కు వెళ్లారు. విష్ణుపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. '' శనివారం నేను షూటిగ్‌లో ఉన్నాను. నా కొడుకి స్కూల్‌లో జరిగిన ఈవెంట్‌కు నా భార్య వెళ్లింది. మా అమ్మ బర్త్‌డే సందర్భంగా విష్ణు తన అనుచరులు, బౌన్సర్లతో వచ్చాడు. జనరేటర్‌లో పంచదార పోయించి, విద్యుత్ సరఫా నిలిపివేశారని'' మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కూడా చూడండి: నేడే "బిగ్ బాస్-8" లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు! Manchu Family Fight ఇదిలాఉండగా.. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మోహన్‌బాబు ఇంటికి మనోజ్ తన అనుచరులతో కలిసి గేట్లు తోసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత మోహన్‌బాబు ఓ జర్నలిస్టుపై మైక్‌తో దాడి చేయడం సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఘటన జరిగిన తర్వాత మోహన్ బాబు ఓ ఆడియోను కూడా రిలీజ్ చేశారు. తాను కావాలని దాడిచేయలేదంటూ చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ జర్నలిస్టును ఆదివారం మోహన్ బాబు, విష్ణు పరామర్శించారు. Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్! ఇదిలాఉండగా.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వల్లే గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది. మోహన్‌బాబు యూనివర్సిటీ బాధ్యతలు మొత్తం విష్ణుకే అప్పగించడంతో.. వర్సిటీలో జరుగతున్న అవకతవకలపై గతంలోనే మనోజ్ లేవనెత్తారు. అలాగే జల్‌పల్లి ఫామ్‌హౌస్ కూడా మనోజ్‌కు దక్కకుండా చేస్తున్నారనే వాదన ఉంది. ఈ విషయాల వల్లే మోహన్‌బాబు, మనోజ్‌ల మధ్య గొడవలకు దారీ తీశాయనే ప్రచారం నడుస్తోంది. Also Read: జమిలి ఎన్నికల బిల్లుకు బ్రేక్.. పునరాలోచనలో పడ్డ కేంద్రం Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం