మంచు ఫ్యామిలీ వార్ రచ్చకెక్కిన నేపథ్యంలో తొలిసారి మంచు మనోజ్ మీడియోతో వివరంగా మాట్లాడారు. గొడవకు సంబంధించి పూర్తి వివరాలు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతానన్నాడు. ఈ మేరకు మీడియాతో మనోజ్ మాట్లాడుతూ.." నేను నా సొంత కాళ్ళ మీద నిలబడ్డా. నేను ఆస్తి అడగలేదు, డబ్బులు అడగలేదు. ఎవరి దగ్గర ఏమీ ఆశించింది లేదు. మీకు అన్ని విషయాలు తెలియాలి. ఈ గొడవల మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..! ఇకపై ఆగలేను.. ఇలాంటి రోజు వస్తుంది ఊహించలేదు. మా అన్న, మా నాన్న తరుపున మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా. మీడియా మీద దాడి చేయడం బాధ కలిగించింది. నాకోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధ కలిగించింది. నా బంధువులపై కూడా దాడి చేశారు. ఇన్ని రోజులు ఆగాను ఇకపై ఆగలేను. నా భార్య ఏడు నెలల కూతురు పేరు లాగుతున్నారు. ఆస్తికోసం మా నాన్నతో గొడవ పడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మా నాన్న దేవుడు.. కానీ.. ఈరోజు చూస్తున్నది మా నాన్నను కాదు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతాను. నేను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తా.." అని అన్నాడు. Also Read : మీనాక్షి చౌదరికి శ్రీలీల షాక్.. డ్యాన్సింగ్ క్వీన్ కి అదిరిపోయే ఆఫర్