Manchu Family: మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు చిలికి చిలికి గాలి వానలాగా మారిపోయాయి. వీళ్ళ కొట్లాట మీడియా ప్రతినిధుల ప్రాణం మీదకి వచ్చింది. ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. గతంలోనూ మంచు ఫ్యామిలీ మీడియాపై దాడి చేసిన సందర్భాలున్నాయి.

New Update
manchu001

మంచు ఫ్యామిలీ మధ్య తగాదాలు చిలికి చిలికి గాలి వానలాగా మారిపోయాయి. వీళ్ళ కొట్లాట మీడియా ప్రతినిధుల ప్రాణం మీదకి వచ్చింది. నిన్న రాత్రి జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఇంటి దగ్గరకొచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. 

ఈ దాడిలో పలువురు రిపోర్టర్స్ కు గాయాలయ్యాయి. దీంతో మీడియా సంఘాలు మోహన్ బాబు వ్యవహారం శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. మీడియాపై దాడి చేయడం మంచు ఫ్యామిలీకి కొత్తేమి కాదు. గతంలో చాలాసార్లు ఇలానే జరిగింది. ఇప్పుడు ఈ వివాదం ముదరడంతో గతంలో మంచు ఫ్యామిలీ.. మీడియాపై దాడి చేసిన వీడియోలను వెతికి మరీ నెట్టింట షేర్ చేస్తున్నారు.  

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

తిరుపతిలో రిపోర్టర్ పై దాడి..

గతంలో తిరుపతిలోని విద్యానికేతన్ విద్యా సంస్థల బౌన్సర్ల చేతిలో మీడియాకు సంబంధించిన కెమెరా మెన్ దాడికి గురయ్యాడు. ఆ దాడిలో సదరు కెమెరా మెన్ చెవికి తీవ్ర గాయమైంది. కర్ణభేరికి రంధ్రం పడడంతో డాక్టర్స్ ఆతనికి ఆపరేషన్ చేయాలని సూచించారు.

మనోజ్ బౌన్సర్స్ దాడి..

ఇటీవల మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్ వచ్చారు. ట్రీట్ మెంట్ అనంతరం బయటికొస్తున్న సమయంలో ఓ రిపోర్టర్ ఏం జరిగిందని మనోజ్ దగ్గరికి వెళ్లగా.. అతని బౌన్సర్లు రిపోర్టర్ ను పక్కకి లాగి పడేశారు. దీంతో అతను బౌన్సర్స్ పై ఫైర్ అయ్యాడు. అయినా కూడా మనోజ్ కనీసం మీడియాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా గతంలో పలుమార్లు మంచు హీరోలు మీడియాపై దాడి చేశారు.

Also Read : హాస్పిటల్ లో చేరిన మోహన్ బాబు..!

నిజానికి మంచు ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని సాల్వ్ చేసుకోడానికి మా ఇంటికే వస్తారని ఓ సందర్భంలో మంచు విష్ణు అన్నాడు. అలాంటిది ఇప్పుడు మంచు ఫ్యామిలీ మధ్య కొట్లాట రోడ్డుకెక్కింది.ఈ ఇష్యూపై ఇండస్ట్రీ నుంచి కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం. 

Also Read: మోహన్ బాబుకు బిగ్ షాక్.. పద్మశ్రీ రద్దు?

Also Read: హైదరాబాదీ మహిళని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.5 కోట్ల చీటింగ్

#manchu-manoj #Big Fight In Manchu Family
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు