Mohan babu - Rajinikanth: ప్రాణ స్నేహితులు ఒకే చోట.. వీడియో వైరల్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య తిరుపతిలోని మోహబాబు యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ వారికి మోహన్‌ బాబు అంగరంగ వైభవంగ ఘన స్వాగతం పలికారు. అనంతరం వీరు చాలా విషయాలు ముచ్చటించారు. ఆ తర్వాత యూనివర్సిటీని సందర్శించారు.

New Update
kollywood super star rajinikanth and his daughter aishwarya visit mohababu university in tirupathi

kollywood super star rajinikanth and his daughter aishwarya visit mohababu university in tirupathi

Mohan babu - Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajini Kanth), టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) ఎంతటి ప్రాణ స్నేహితులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి మధ్య స్నేహం గురించి అటు టాలీవుడ్‌లోనూ ఇటు కోలీవుడ్‌లోనూ ఎవ్వరిని అడిగినా చెప్తారు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని. అయితే వీరిద్దరి స్నేహం ఇప్పటిది కాదు. సినీ కెరీర్‌ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది. 

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

ఎన్నోసార్లు వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ఇద్దరూ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. అంతేకాకుండా రజినీకాంత్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. మోహన్ బాబు ఇంటికి వెళ్లకుండా ఉండరు. అలాగే మోహన్ బాబు కూడా చెన్నై వెళ్తే రజినీ కాంత్ ఇంటికి వెళ్లకుండా ఉండలేరు.

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

అంతటి స్నేహం వీరిద్దరిది. వీరిద్దరు అప్పట్లో కలిసి నటించిన ఒక సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మోహన్ బాబు, రజినీకాంత్ కలయికలో వచ్చిన పెదరాయుడు సినిమా మంచి హిట్ అందుకుంది. 

మరోసారి కలుసుకున్న ప్రాణ స్నేహితులు

ఇదిలా ఉంటే రజినీకాంత్ తాజాగా మోహన్ బాబును కలుసుకున్నారు. ఆయన తన కూతురు ఐశ్వర్యతో కలిసి తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడ మోహన్ బాబు అంగరంగ వైభవంగా పూలతో వీరికి ఘన స్వాగతం పలికారు.

 

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

అనంతరం వీరు చాలా విషయాలు ముచ్చటించారు. ఆ తర్వాత యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ రజినీకాంత్‌ను చూసి తెగ సంబరపడిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరిద్దరూ కలకాలం ఇలాగే ప్రాణ స్నేహితుల్లా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు