/rtv/media/media_files/2025/11/16/varanasi-event-2025-11-16-19-47-28.jpg)
Varanasi Event
Varanasi Event: తెలుగు సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి(Rajamouli), ‘బాహుబలి’ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద పేరు తెచ్చుకున్నారు. బాహుబలి ముందు-బాహుబలి తర్వాత అని చెప్పుకునేంత భారీ ప్రభావం ఆ సినిమా చూపింది. ఆయన కృషి, విజన్, భారీ బడ్జెట్‌తో రిస్క్ తీసుకోవడం వల్లే ఆ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ స్థాయి సక్సెస్ కారణంగా రాజమౌళి తరువాత వచ్చే ప్రతి సినిమా పై ప్రేక్షకుల్లో అపారమైన అంచనాలు ఉంటాయి.
ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ మహేష్ బాబు తో చేస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ పై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ద్వారా రాజమౌళి పాన్- వరల్డ్ మార్కెట్లోకి మరింత బలంగా అడుగు పెట్టబోతున్నారు. ఆయన మార్క్ టైటిల్, విజువల్స్, ప్రెజెంటేషన్ అన్ని కలిపి ఒక ప్రత్యేకతను సృష్టిస్తాయి. అందుకే రాజమౌళి తీసిన సినిమా అంటే అది ఖచ్చితంగా మంచి అనుభూతినే ఇస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.
తాజాగా ‘వారణాసి’ టైటిల్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో భారీ స్థాయిలో జరిగింది. ఈ ఈవెంట్‌ను రాజమౌళి టీమ్ ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు ఆలస్యంగా బయటికి వచ్చిన ఒక విషయం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ ఈవెంట్‌కు హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(Avatar, Titanic దర్శకుడు James Cameron) చీఫ్ గెస్ట్‌గా రానున్నారని ముందుగా భావించారట. బాహుబలి చూసిన తర్వాత రాజమౌళిని పలు మార్లు పొగిడిన జేమ్స్ కామెరూన్ ఈవెంట్‌కు రావడానికి కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఆయన Avatar 3 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తిగా బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు.
ఈ విషయం ఈవెంట్ తర్వాత తాజాగా బయటకు రావడంతో, అభిమానులు “జేమ్స్ కామెరూన్ వచ్చి ఉంటే బాగుండేది!” అంటూ మాట్లాడుతున్నారు.
అయితే ఇక్కడే అసలు హైలైట్ ఉంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, రాజమౌళి ‘వారణాసి’ టీజర్‌ను మరో ఆరు నెలల తర్వాత జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది సాధ్యమైతే, ఈ సినిమా హాలీవుడ్లో కూడా భారీ హైప్‌తో నిలబడే అవకాశం ఉంది.
మొత్తానికి, రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా పై రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. హాలీవుడ్ స్థాయి ప్రమోషన్స్ కూడా జతకావడంతో, ఈ ప్రాజెక్ట్ పై గ్లోబల్ లెవెల్ లో దృష్టి పడడం ఖాయంగా కనిపిస్తోంది.
Follow Us