సీఎం రేవంత్ పేరు మరిచిపోయిన మరో హీరో.. సోషల్ మీడియాలో దుమారం

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికే సమయంలో హీరో బాలదిత్య సీఎం పేరును మరిచిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో దుమారం నడుస్తోంది. సీఎం ఫ్యాన్స్ హీరో బాలదిత్యపై మండిపడుతున్నారు.

New Update
cm name

cm name Photograph: (cm name )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరో హీరో  మరిచిపోవడం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.  హైదరాబాద్‌ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆదివారం (జనవరి 05)  సీఎం  రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అయితే దీనికి హోస్ట్ గా వ్యవహరించిన హీరో బాలాదిత్య సీఎంకు స్వాగతం పలికే సందర్బంలో మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్‌ కుమార్‌ గారు అంటూ ఉచ్ఛరించాడు.

దీంతో సభలో కిందున్న వారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే తప్పు తెలుసుకున్న  బాలాదిత్య క్షమించాలి  సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉచ్ఛరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో  బాలాదిత్య తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.  ఒక రాష్ట్ర సీఎం పేరును ఎలా మర్చిపోతారంటూ ఫైరవుతున్నారు. 

తడబడ్డ అల్లు అర్జున్

ఇక ఇటీవల పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా హీరో అల్లు అర్జున్ తన సినిమాకు సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో సీఎం పేరు విషయంలో తడబడ్దాడు.  తానేమీ మరిచిపోలేదని తడబడ్డానని బన్నీ చెప్పుకొచ్చారు. ఆ ఘటన మరిచిపోకముందే ఇప్పుడు మరో హీరో సీఎం పేరు మరిచిపోవడం  హాట్ టాపిక్ గా మారింది. 

Also Read :  భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా?

Also Read :  మాట్లాడలేని పరిస్థితుల్లో హీరో విశాల్‌..అసలేమైందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు