/rtv/media/media_files/2026/03/22/harish-shankar-2026-03-22-10-57-18.jpg)
Harish Shankar
. Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన తాజా చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్”కు(Ustaad Bhagat Singh) దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారుఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన “గబ్బర్ సింగ్” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. తాజాగా వచ్చిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది.
ఇటీవల ఫ్యాన్స్‌తో జరిగిన ఒక సంభాషణలో హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. ఈ విషయం విన్న అభిమానులు చాలా ఆనందపడ్డారు. కొత్త సినిమా కథ పూర్తిగా భిన్నంగా ఉండి, కేవలం అభిమానులకే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
“ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించగా, పార్తిబన్ విలన్ పాత్రలో కనిపించాడు. అలాగే కెఎస్ రవికుమార్, గౌతమీ, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను థమన్ ఇచ్చారు.
బాక్సాఫీస్ విషయానికి వస్తే, ఈ సినిమా మెల్లగా స్థిరంగా కలెక్షన్లు సాధిస్తోంది. మూడో రోజున బుక్‌మైషోలో సుమారు 1.35 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ముందు రోజు కంటే కొద్దిగా తక్కువైనా, మొత్తం టికెట్ సేల్స్ మాత్రం 10 లక్షలు దాటాయి.
ఇక ఆదివారం కలెక్షన్లు ఈ సినిమాకు చాలా కీలకం. ఎందుకంటే “ధురంధర్ 2” అనే సినిమా కూడా తెలుగురాష్ట్రాల్లో బలమైన పోటీ ఇస్తోంది. మొత్తానికి “ఉస్తాద్ భగత్ సింగ్” స్థిరంగా రన్ అవుతుండగా, రానున్న రోజుల్లో కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
Follow Us