మేము తెలంగాణ వాళ్ళం .. మాకు మర్యాద ఒకటే కాదు మటన్ ముక్క కూడా కావాలి అనేది ఓ సినిమాలోని డైలాగ్ . తెలంగాణ అంటే తాగడం, తినడమే అన్నట్టుగా ముందు నుంచి కొంతమంది ప్రొజెక్ట్ చేస్తూనే వస్తున్నారు. కొన్ని సినిమాలలో కూడా ఇదే చూపిస్తూ వచ్చారు. దీంతో తెలంగాణ అంటేనే తాగడం, తినడం అనే ముద్ర పడేలా కొంతమంది చిత్రీకరించారు. ఇప్పుడు దిల్ రాజు లాంటి పెద్ద స్థాయి వ్యక్తులు కూడా అదే ప్రయత్నం చేసేలా మాట్లాడారు. వెంకటేష్ హీరోగా ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిజామాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ ఆంధ్రాలో సినిమాకు వైబ్ అవుతే.. తెలంగాణలో కల్లు, మటన్‌కు వైబ్ అంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ మాటలు వదిలేశారు దిల్ రాజు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దిల్ రాజ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. Also Read : శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ ఎమోషనల్ Dil Raju వెకిలి మాటలుతెలంగాణ ను అవమానించేలా చిల్లర కామెంట్స్..!నిజామాబాద్ లో సినిమా ప్రమోషన్ ప్రోగ్రాం లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు@alluarjun @DilRajuProdctns @KChiruTweets @AlwaysRamCharan @INCTelangana… pic.twitter.com/Sb1ZvE14fL — Journalist Vijaya Reddy (@VijayaReddy_R) January 7, 2025 Also Read : ధనుష్ తర్వాత చంద్రముఖి మేకర్స్..నయనతారకు మరోసారి లీగల్ నోటీసులు సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే. కథలో ఓ వ్యక్తి కిడ్నాప్ కావడం వలన ప్రభుత్వానికి నష్టం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనటానికి ఎక్స్-పోలీస్ అయిన ఆఫీసర్ వెంకటేష్‌ను విధుల్లోకి తీసుకురావడం కోసం, పోలీసులు మీనాక్షిని పంపిస్తారు. కథలో వింత మలుపులు ఏర్పడతాయి. పెళ్లయిన వెంకటేష్ జీవితంలోకి మీనాక్షి రావడం, ఆయన భార్య, మాజీ ప్రేయసి మధ్యలో అతని పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఎంటర్టైనింగ్ గా చూపించబోతున్నారు. ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీ, పంచులతో నింపేశారు. అనిల్ రావిపూడి - వెంకటేష్ గత చిత్రాలైన ఎఫ్2, ఎఫ్3 కి మించిన ఎంటర్టైన్మెంట్ ను ఈ సినిమాలో ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. చూస్తుంటే పండక్కి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ హౌజ్ ఫుల్స్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది. Also Read : ముంబాయి నటి జత్వానీ కేసు.. హైకోర్టు కీలక తీర్పు Also Read : ప్రభాస్ Vs అజిత్.. ఒకే రోజు రెండు సినిమాలు!