/rtv/media/media_files/2026/03/18/dhurandhar-2026-03-18-10-29-45.jpg)
రణవీర్ సింగ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ధురంధర్ 2 రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, అంతకంటే ముందే ఈరోజు నుంచే పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభమయ్యాయి.
అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు (CBFC) రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాలో భారీగా కోతలు విధించింది. ముఖ్యంగా అతి భయంకరంగా ఉన్న హింసాత్మక దృశ్యాలను తొలగించాలని ఆదేశించింది. కళ్లు నలిపేయడం, తల నరకడం, సిమెంట్ బ్లాకులు, సుత్తితో తలపై కొట్టడం వంటి 21 ప్రధాన మార్పులను బోర్డు సూచించింది. వీటితో పాటు సబ్‌టైటిల్స్‌లో పెద్ద నోట్ల రద్దు తేదీలను సరిచేయాలని, సమాచారంలో లాహోర్ స్థానంలో ఢిల్లీగా అని మార్చాలని బోర్డు సూచించింది. ఇక ప్రధాని ప్రస్తావనలు, వార్తా ఫుటేజీని వాడినందుకు మేకర్స్ అధికారిక అనుమతి పత్రాన్ని కూడా సమర్పించారు.
సెన్సార్ బోర్డు 'A' రేటింగ్
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'A' రేటింగ్ ఇచ్చింది. సెన్సార్ కట్‌ల తర్వాత ఇండియాలో ఈ సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాల 36 సెకన్లుగా ఉంది. అంటే, విదేశాల్లో విడుదలయ్యే వెర్షన్ కంటే భారతీయ వెర్షన్ దాదాపు 6 నిమిషాలు తక్కువగా ఉంటుంది.సెన్సార్ బోర్డు నిర్ణయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. "సినిమాకు 'A' రేటింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ సీన్లను కట్ చేయడం ఏంటి?" అని కొందరు ప్రశ్నిస్తుంటే, "సెన్సార్ బోర్డు పని సినిమాను ఎడిట్ చేయడం కాదు, రేటింగ్ ఇవ్వడం మాత్రమే" అని మరికొందరు మండిపడుతున్నారు.
2025 డిసెంబర్‌లో విడుదలైన ధురంధర్ ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు పార్ట్ 2 ట్రైలర్‌లో రణవీర్ సింగ్ జస్కిరాత్, హమ్జా అనే రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపిస్తూ అంచనాలను పెంచేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే, పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఇప్పటికే సుమారు రూ. 40.54 కోట్లు వసూలు కాగా, మొదటి రోజు కోసం 15 వేల షోలకు గాను 4.70 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Follow Us