/rtv/media/media_files/2025/02/06/eGX9Rf4ZupnwbfJZIsNt.jpg)
Devi steps Photograph: (Devi steps)
నాగచైతన్య (Naga Chaithanya), సాయి పల్లవి (Sai Pallavi) కలిసి నటించిన తండేల్ (Thandel) సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇటీవల హైలెస్సా పాట విడుదల కాగా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. హైలెస్సా స్టెప్‌లు ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఓపెన్ చేసినా కనిపిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
వస్తున్నాం దుల్లగొడ్తున్నాం 🌊🔥⚓
— Geetha Arts (@GeethaArts) February 6, 2025
That's the tweet. 😎🤙🏻#Thandel in cinemas from tomorrow 🔥 pic.twitter.com/YLclLTci5L
పాటలే కాదు.. డ్యాన్స్ కూడా ఇరగదీస్తున్నావంటూ..
ఇదిలా ఉండగా ఈ పాటకు దేవీశ్రీ ప్రసాద్ స్టెప్‌లు వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకుడు చందు మెండేటి, దేవీశ్రీ కలిసి ఈ పాటకు స్టెప్‌లు వేశారు. గీతా ఆర్ట్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. వస్తున్నాం.. దుల్లగొడుతున్నామని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో దేవీశ్రీ డ్యాన్స్ దుల్లగొడుతున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భలేగా స్టెప్‌లు వేశాడని కామెంట్లు చేస్తున్నారు. దేవీశ్రీ అద్భుతంగా పాటలు పాడటమే కాదు.. డ్యాన్స్ వేసే టాలెంట్ కూడా తనలో ఉందని నెటిజన్లు అంటున్నారు. మరికొందరు తండేల్ విడుదలకు ముందే సక్సెస్ పార్టీ చేసుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్ స్టెప్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?
ఇది కూడా చూడండి: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?