Coolie : 'కూలీ' కోసం బరిలోకి దిగిన బాలీవుడ్ స్టార్..!

రజినీకాంత్ 'కూలీ' మూవీలో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ లేటెస్ట్ షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఆమిర్‌.. జైపూర్‌ వెళ్లారట. దాదాపు పది రోజుల పాటు సాగే ఈషెడ్యూల్‌ లో రజనీకాంత్, ఆమిర్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది.

New Update
rajni

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ'. రజినీకాంత్ కెరీర్లో 171 వ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈసారి రజినీకాంత్ ని వెండితెరపై సరికొత్తగా చూపించబోతున్నాడు.

Also Read: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నారట. ఆయన మరెవరో కాదు ఆమీర్ ఖాన్ అని సమాచారం. ఆమిర్‌ ఖాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ, దీనిపై చిత్ర బృందం నుంచి ఏ స్పష్టతా రాలేదు.

షూట్ లో జాయిన్ అయిన ఆమిర్..

అయితే ఇప్పుడీ వార్తలకు బలం చేకూర్చుతూ ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ఆమిర్‌.. జైపూర్‌లో అడుగు పెట్టినట్లు సమాచారం. దాదాపు పది రోజుల పాటు సాగే షెడ్యూల్‌ ఇదని.. దీనిలో భాగంగా రజనీకాంత్, ఆమిర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలిసింది.

Also Read: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్‌..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

ఇక ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ భారీ తారాగణాన్ని ఎంచుకున్నాడు. ఆమీర్ ఖాన్ తో పాటూ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read : మంచు ఫ్యామిలీకి మీడియా అంటే చులకనా? గతంలోనూ చాలాసార్లు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు