టాలీవుడ్ సినీయర్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో పుల్ జోష్ తో దూసుకుపోతుంది. ఈ షో పుణ్యమా అని బాలయ్య ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటకు వదిలారు. అదేంటంటే.. డాకు మహారాజ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా.. డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అన్‌స్టాపబుల్ షోకు గెస్టులుగా వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అడిగిన పలు ప్రశ్నలకు బాలయ్య సమాధానమిచ్చారు. బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరినీ తాను గారాబంగా పెంచానని అయితే తాను బ్రాహ్మణికి ఎక్కువగా భయపడతానని తెలిపారు. Also Read : స్విమ్మింగ్ పూల్ లో శ్రద్ధా దాస్ ఫోజులు.. చూస్తే ఎగిరిపోతాయి మీ ఫ్యూజులు మణిరత్నం ఫోన్ చేసి ఇక అప్పట్లో డైరెక్టర్ మణిరత్నం ఓ సినిమా కోసం తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి (Nara Brahmani) కి హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారని తెలిపారు బాలయ్య. కానీ ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందని చెప్పుకొచ్చారు. ఇక తన చిన్న కూతురు తేజస్విని అయిన హీరోయిన్ గా రాణిస్తుందని అనుకున్నానని కానీ ఆమె కేవలం అద్దంలో చూసుకుంటూ యాక్ట్ చేసేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు బాలయ్య. ఇద్దరు తమ తమ రంగంలో పేరు తెచ్చుకుని వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి ఎదిగారన్నారు బాలయ్య. ఇక తన కూతురు బ్రాహ్మణికి తన తరువాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే చాలా ఇష్టమనే విషయాన్ని బయటపెట్టారు బాలయ్య. అయితే మణిరత్నం సినిమాలో బ్రాహ్మణి హీరోయిన్ గా చేసుంటే బాగుండేదని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Also Read : అయ్యో అయ్యో అయ్యయ్యో.. సైలెంట్గా పెళ్లి పీటలెక్కిన హీరోయిన్ డాకు మహారాజ్ సినిమా ఇక డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను సంక్రాంతికి జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక ప్రాత్రాల్లో కనిపించనున్నారు. Also Read : రాసి పెట్టుకోండి, ఈ సంక్రాంతికి 'దబిడి దిబిడే'.. 'డాకు మహారాజ్' పై నిర్మాత పోస్ట్