Allu Arjun: మెగాఫ్యామిలీలో మంటలు చల్లారుతున్నట్లు తెలుస్తోంది. తన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లనున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌ను బన్నీ కలవనున్నాడు. చిరు ఇంట్లోనే అల్లు అర్జున్ లంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియడంతో విశ్వంభర షూటింగ్ మధ్యలోనే ఆపేసి వచ్చారు చిరు. నాగబాబుతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు బిజీగా అల్లు అర్జున్... నిన్న సెలబ్రెటీలంతా ఇంటికి రావడంతో బిజీగా అల్లు అర్జున్ ఉన్నాడు. ఇవాళ చిరును కలిసి థాంక్యూ చెప్పనున్నాడు. నంద్యాలలో అల్లు అర్జున్ ప్రచారం నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా సీన్ మారింది. కొంతకాలంగా సోషల్ మీడియాలో అల్లు, మెగా ఫ్యాన్స్ ఫైటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా పుష్ప 2 ప్రొమోషన్స్ లో కూడా తన ఫ్యాన్స్ కు థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ పేరును ఎక్కడ ప్రస్తావించకుండా ప్రొమోషన్స్ చేశాడు. అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటిదాకా మెగా హీరోలు ఎక్కడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో చిరు ఇంటికి అల్లు అర్జున్ వెళ్తుండటంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మెగా ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. Also Read: అల్లు అర్జున్ కు మరో బిగ్ షాక్.. శ్రీతేజ్ కు సీరియస్! బన్నీని కలవని పవన్... హీరో అల్లు అర్జున్ కు తన మామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌కు వచ్చిమరీ బన్నీని కలవకుండానే ఏపీకి వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. విజయవాడ నుంచి రాత్రి హైదరాబాద్ కు పవన్ వచ్చారు. అయితే జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను కలవడానికే హైదరాబాద్ వచ్చారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. అందరి ఊహలకు, చర్చలకు చిక్కకుండా.. వ్యక్తిగత పని మీద వచ్చి తిరిగి వెళ్లిపోయారని టాక్ నడుస్తోంది. అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్‌కు మెగా పరామర్శ దక్కలేదు. టాలీవుడ్ మొత్తం క్యూ కట్టినా బన్నీని మెగా హీరోలు కలవకపోవడం చర్చనీయాంశమైంది. Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్! Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్!