తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇన్ని రోజులుగా నోళ్లు కట్టుకున్న నాన్ వెజ్ ప్రియులు కార్తీకమాసం ముగియడంతో.. ఒక్కసారే ఎగబడే సరికే.. కోడిగుడ్లకు ధర పెరిగింది. ఒక్క గుడ్డు ధర ఏకంగా రూ.7 లను దాటేసింది. ఇది కూడా చదవండి : నల్గొండకు సీఎం రేవంత్.. చిరకాల స్వప్నం నెరవేరిందంటూ వెంకట్ రెడ్డి ఎమోషనల్! నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ఒక గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించగా.. 30 గుడ్ల ట్రే ధర రూ.186గా ఉంది. వెన్‌కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు రూ.85 లు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర 7.08 రూపాయలుగా ఉంది. ఇది కూడా చదవండి :ప్రిన్సిపల్, మెస్ ఇంఛార్జ్ తిన్నాకే పిల్లలకు పెట్టండి.. హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్‌లైన్ మార్కెట్లో కేవలం 6 గుడ్లను ఏకంగా 112 రూపాయలకు విక్రయిస్తోంది. పోషకాల్లో గుడ్డు టాప్ ప్లేస్ లోనే ఉంటుంది. ఇక పోతే ప్రస్తుతం మార్కెట్లో రకరకాల గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రొటీన్ ఎగ్స్, నౌరిష్ గుడ్లు, బ్రౌన్ ఎగ్స్ ఇలా చాలా పేర్లతో అందుబాటులో ఉన్నాయి. సూపర్ మార్కెట్లో ప్యాక్ చేసిన ఒక్కో గుడ్డు 10 నుంచి 20 రూపాయల మధ్య అమ్ముతున్నారు. ఇది కూడా చదవండి: America: కొడుకుకే కాదు..మరికొందరికి కూడా..!