Duvvada Srinivas : హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం కనుసైగలాలోనే బన్నీ అరెస్టు జరిగిందని ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తొందర పడ్డారని అన్నారు. కళాకారులను విమర్శించే వారికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం అని అన్నారు. Also Read: విషాదం.. యువ రైతు ప్రాణం తీసిన అప్పులు అరెస్ట్ చేస్తే చేసుకోండి... తనను అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వ హయాంలో కుట్ర జరుగుతుందని అన్నారు. తాను ఇక్కడే ఉంటానని.. ఎవరొచ్చి అరెస్టు చేస్తారో చూస్తా అని సవాల్ చేశారు. 41 A నోటీస్ లో ఎక్కడికి, ఏ తేదీన రావాలో పోలీసులు చెప్పలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ని అరెస్టు చేసి... ఆ తర్వాత తనకు అరెస్టు చేయాలని అన్నారు. కేసులు తనకేమి కొత్త కాదని... 18 కేసుల్లో ఏ వన్ గా ఉన్నానని చెప్పారు. అచ్చన్నాయుడు ఎత్తుగడలో పోలీసులు చిత్తవక తప్పదని హెచ్చరించారు. 41 A నోటీసులు జారీ పై పోలీసులను కోర్టుకు ఎక్కిస్తా అని అన్నారు. Also Read: అల్లు అర్జున్‌కు పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్! నిన్న నోటీసులు... వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు నిన్న పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, జనసేన ఆఫీస్ పై దాడి చేశారని జనసేన నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో టెక్కలిలోని దువ్వాడ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడారు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణలు చేశారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని తాను కాదని దువ్వాడ శ్రీను స్పష్టం చేశారు. Also Read: కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు! Also Read: సీఎంకి తలనొప్పిగా మారిన నాటుకోడి చికెన్ వివాదం.. వీడియో వైరల్!