AP Crime: ఏపీలో కలకలం..ఇద్దరు బాలికలు మిస్సింగ్

విజయవాడలో ఇద్దరు బాలికలు మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ఇంట్లో నుంచి బాలికలు వెళ్లిపోయారు. బాలికలు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
missing children vijayawada

missing children vijayawada Photograph

AP Crime: బాలికల మిస్సింగ్ ఘటనలు రోజురోజుకు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో ఘటన మరువక ముందే ఏపీలో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా విజయవాడలో   ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ ఘటన విజయవాడలో కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఇంట్లో నుంచి బాలికలు వెళ్లిపోయారు. బాలికలు నున్నలో ఆరో తరగతి చదువుతున్నారు. 

ఇది కూడా చదవండి: ఈ ఐదుగురు బొప్పాయిని అస్సలు తినకూడదు..ఎందుకో తెలుసా..?

బాలకలు మిస్సింగ్:

అయితే బయటకు వెళ్లిన బాలుకలు ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికలు ఎక్కడికి వెళ్లారు..? అనే కోణంలో విచారణ చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికలు ఎక్కడికి వెళ్లారు ఏంటో అనే ఆందోళనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: రాత్రి స్వెట్టర్ వేసుకుని నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు