తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గాయపడిన వారిలో మరో ఇద్దరు చనిపోయారని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఇక మరికొందరి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. అలాగే మరోవైపు తిరుపతి బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. Also Read: TML: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు భక్తుల ఆగ్రహం.. మరోవైపు తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట జరిగిందని మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపమే దీనికి కారణమంటున్నారు. నిజానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. Also Read: TML: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, లోకేశ్, జగన్ స్పందన