వైకుంఠ ఏకాదశికి పటిష్టమైన చర్యలు , కట్టుదిట్టమైన ప్రణాళికలతో టీటీడీ భక్తులకు సేవలు అందిస్తుందని ఈ రోజు ఉదయమే భక్తుల ప్రశంసల వెల్లువ కురిపించారు. కానీ సాయంత్రం అయ్యేసరికి అనుకోని సంఘటన జరిగింది. టికెట్ల జారీ దగ్గర తోపులాట, తొక్కిసలాట జరిగి ఆరుగురు మతికి కారణమయింది. మరింత మంది గాయాలపాలయ్యారు. అయితే దీటంతటికీ ఇద్దరు వ్యక్తులు కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. కావాలనే వారు ఉద్దేశపూర్వకంగా ఈపని చేశారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరా అని టీటీడీ అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు ఇదంతా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలేం జరిగింది? టికెట్ల జారీ క్యూ లైన్ దగ్గర అనారోగ్యంతో ఆయసపడుతున్న వృద్దురాలను గుర్తించి గుంపు నుండి తప్పించి గేటు లోపలికి తీసుకువచ్చేందుకు టీటీడీ సిబ్బంది ప్రయత్నించారు. దీనికి వృద్ధురాలి వెనుకున్న భక్తులు కూడా సహకరించారు. ఆమె ఒక్కతినే లోపలికి తీసుకుని వెళుతున్నారు. కానీ ఇంతలో కొద్ది దూరంలో కేకలు అరుపులతో దుమారంలేచింది. అక్కడి నుంచి అది ఎక్కువై తోపులాటగా మారింది. అయితే ఇది ఎవరు చేశారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఒక్కరు లేదా ఇద్దరు చేశారా? లేదా ఏకంగా ఒక గుంపు చేసిన పనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. Also Read: తొక్కిసలాటలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య ఘటనపై టీటీడీ సీరియస్.. తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న టీటీడి అధికారులు , అన్ని వైపుల నుండి భక్తులను వాకబు చేస్తున్నారు. మరోవైపు సి సి ఫుటేజ్ ల ఆధారంగా తొక్కిసలాట ఎలా జరిగిందో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇక మొదటి వరుసలోని భక్తుల ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే వెనుక నుండి తోపులాట చేసి తొక్కిసలాటకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయం చేసేందుకు ప్రయత్నం చేసిన సిబ్బందికి చిక్కులు తేవడమే కాక ఆరుగురు మృతికి కారణమయ్యారని ఆరోపిస్తున్నారు. Also Read: TML: తిరుమల తొక్కిసలాట భీభత్సం..వైరల్ అవుతున్న వీడియోలు