తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార సర్వ దర్శన టికెట్ల జారీలో తొక్కిసలాట జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది. ఇక మరికొందరి భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. అలాగే మరోవైపు తిరుపతి బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్ దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. మరోవైపు తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట జరిగిందని మండిపడుతున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపమే దీనికి కారణమంటున్నారు. నిజానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. Also Read: కేటీఆర్ చెప్పినట్లే చేశా.. ACB విచారణలో బాంబ్ పేల్చిన అరవింద్! భారీగా పెరిగిన రద్దీ ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వెనుకాడటం లేదు. నిన్న (జనవరి 07)వ తేదీ మంగళవారం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. 16 కంపార్ట్‌మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. దీని బట్టి చూస్తే భక్తుల రద్దీ ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ఇకపోతే తాజాగా తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారన్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 10 వ తేదీ ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతుందని అన్నారు. Also Read: తెలంగాణ కోర్టుల్లో 1673 ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని అన్నారు. 10 వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం కదులుతుందని అన్నారు. దీంతో అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేశాం అని తెలిపారు. టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేశాం అని పేర్కొన్నారు. తిరుమలలో అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశం ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారుపది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసింది10 వ తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభంవైకుంఠ ఏకాదశి… — B R Naidu (@BollineniRNaidu) January 8, 2025 Also read: బాలయ్య హీరోయిన్ కు వేధింపులు.. 27మందిపై కేసు, పోలీసుల అదుపులో వ్యాపార వేత్త వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేశామని తెలిపారు. సీఎం ఆదేశాల ప్రకారం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసామన్నారు. మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు. 3 వేల సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. గోవిందమాల భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండదని తెలిపారు. Also Read: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్.. మందుబాబులకు బిగ్ షాక్! అందరు భక్తులతో కలిసి SSD టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. టోకన్లు, టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని.. కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులను ఎవరు ఆపరు.. ఆపలేరన్నారు. అసత్య ప్రచారాలు, అపోహలు నమ్మవద్దని భక్తులను కోరారు. HMPV అనే కొత్త రకమైన వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో భక్తులు మాస్క్ లాంటి స్వీయ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.