/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t101542029-2025-12-13-10-17-59.jpg)
Godavari Pushkaram has been finalized
Godavari Pushkaralu 2027 : దేశంలోనే రెండో అతిపెద్ద నది గోదావరికి పుష్కర ఘడియలు వస్తున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పుష్కరాలకు ముహూర్తం నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది. పుణ్యస్నానాలు ఆచరించే తేదీలను ప్రకటించింది. పరమపవిత్రమైన గోదావరమ్మకు ఉత్సవాలు జరగనున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి జరిగే పుష్కరాలకు సంబంధించి ముహూర్తం నిర్ణయించారు. గోదావరి పుష్కరాలు 2027కు సంబంధించి తేదీలను ప్రభుత్వం విడుదల చేసింది. టీటీడీ సలహాలు, సూచనలతో గోదావరి పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించింది.2027 గోదావరి పుష్కరాలకు ముహూర్తం అధికారికంగా ప్రభుత్వం ఖరారు చేసింది. 2027 జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/13/fotojet-2025-12-13t101725632-2025-12-13-10-19-26.jpg)
ఈ సందర్భంగా గోదావరి పుష్కరాలు 2027కు సంబంధించి ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పుష్కరాలకు ముహూర్తం నిర్ణయించారు.టీటీడీ ఆస్థాన సిద్ధాంతి అభిప్రాయాలకు ఏపీ దేవాదాయ శాఖ ఆమోద ముద్ర వేయగా.. ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ ద్వారా గోదావరి పుష్కరాల ముహూర్తం అధికారికంగా ఖరారు చేశారు.గోదావరి పుష్కరాలు ప్రధానంగా రాజమండ్రిలో జరగనున్నాయి. పుష్కరాల కోసం సుమారు రూ.2,105 కోట్ల నిధులతో పనుల కోసం ప్రతిపాదనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు మంత్రులతో ప్రత్యేక కమిటీ, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లను ప్రభుత్వం నియమించింది.ముహూర్తం ఖరారు చేయడంతో రాబోయే వర్షాకాలంలో గోదావరమ్మకు పండుగ జరగనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా మొద్దు నిద్ర వీడలేదు. గోదావరి పుష్కరాలపై ఇంకా దృష్టి సారించలేదు. ఇదే ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.
Follow Us