/rtv/media/media_files/2025/02/06/Gpr1ginBL8JOSmFV92u8.jpg)
vijayanagaram madar
AP Crime: విజయనగరం జిల్లా దారుణం చోటు చేసుకుంది. పామాయిల్ తోటలో భార్యాభర్తల మద్య తగాదా ఓ నిండ ప్రాణాన్ని బలి తీసుకుంది. అగ్రహంతో ఉన్న భర్త భార్యపై కొడవలితో దాడి చేశారు. దాడి జరిగిన ప్రాంతంలోనే ఏకల గౌరమ్మ (40) అనే మహిళ మృతి చెందింది. ఈ ఘోర ఘటన ఏపీలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దత్తిరాజేరు మండలం చక్కపేటలో చెందిన ఏకల గౌరమ్మ భర్త ఏకల సత్యం నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు గణేష్ సిఐఎస్ఎఫ్ జూర్కాండ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురుకి వివాహం చేశారు.
కంటపై దాడి..
వీరిద్దరు కూలీ పనులు చేసుకుంటు ఆ గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నారు. రోజు పనులకు వెళ్లిన్నట్లు గురువారం ఉదయం కూడా ఇద్దరు కలిసి చుక్కపేట నుంచి సమీప గ్రామమైన గుచ్చిమి పామాయిల్ తోటలో వ్యవసాయ పనికి వెళ్లారు. దారి మధ్యంలో దంపతుల మధ్య ఏం ఘర్షణ జరిగిందో తెలియదు కాని.. భర్త సత్యం చేతిలో ఉన్న కొడవలితో గౌరమ్మ కంటపై దాడి చేశాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: ఉదయం లేచిన తర్వాత నీరు ఎప్పుడు తాగాలి?
ఈ దాడిలో గౌరమ్మ సంఘటన జరిగిన ప్రాంతంలోనే అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సంఘటన జరిగిన ప్రాంతంలో పరిశీలించారు. అక్కడ గౌరమ్మపై దాడి చేసిన కొడవలిని పోలీసులు గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేశారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: విటమిన్ డి కోసం నెలలో ఎన్నిసార్లు సూర్యరశ్మి అవసరం?