/rtv/media/media_files/2025/11/29/local-body-elections-2025-11-29-21-15-15.jpg)
Local Body Elections
Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అ మేరకు-- ఉన్నతాధికారులతో SEC కమిషనర్ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగుస్తుండడంతో ప్రత్యేక దృష్టి సారించింది.-- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చిలో ముగియనుండగా ఏప్రిల్‌తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల విభజన..మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఏపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీలను విభజించడం, విలీనం చేయడం, పురపాలికల్లో కలపడం వంటి మార్పులకు ఈ తాజా ఉత్తర్వులు అవకాశం కల్పించాయి. ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యుల తీర్మానాలు, గ్రామ సభల ఆమోదంతో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సంబంధిత ఉత్తర్వులు గురువారం (నవంబర్ 27) జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, స్థానిక ఎన్నికలకు ముందు గ్రామ పంచాయతీల్లో గ్రామాలను విలీనం చేయడం, విభజించడం.. వంటి మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం 2026 మార్చి నాటికి ముగుస్తోంది. దీంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అక్టోబరు 22న లేఖ రాశారు. గ్రామ పంచాయతీ విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఎన్నికల సంఘం కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గ్రామ పంచాయతీల విభజనపైఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది.
గ్రామ పంచాయతీల్లో మార్పులు చేర్పులు..
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక పంచాయతీని రెండుగా విభజించడం, ఒక పంచాయతీలో ఉన్న గ్రామాలను మరో పంచాయతీలో కలపడం లేదా రెండు పంచాయతీలను విలీనం చేయడం వంటివి చేయడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా పంచాయతీలను.. వాటి సమీప పుర, నగరపాలక సంస్థల్లో కలపడం వంటివి చేయడానికి వీలు కలుగుతుంది. అయితే ఈ మార్పులు చేయాలంటే పాలకవర్గ సభ్యులు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. పాలకవర్గం లేని పంచాయతీల్లో.. స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి.. తీర్మానాలు ఆమోదించాల్సి ఉంటుంది.ఇలా పంచాయతీల్లో ఆమోదించిన తీర్మానాలను.. సంబంధిత జిల్లా కలెక్టర్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయానికి అందజేస్తారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి.. అక్కడి నుంచి ప్రభుత్వ ఆమోదానికి ఆ తీర్మానాలు వెళ్తాయి. అయితే ఒక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలను మరో మండలంలో కలపడానికి వీల్లేదు. ఇలాంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే.. ఆ మండల పరిధి వరకే అనుమతిస్తారు.
మరోవైపు, కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా క్లస్టర్ల విధానాన్ని తొలగించారు. ఇప్పటివరకు ఉన్న 7,244 క్లస్టర్ల స్థానంలో.. 13,351 గ్రామ పంచాయతీలను ఇకపై స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా వ్యవహరిస్తారు. దీంతో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజినీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్లు వంటి విభాగాలు ఉంటాయి. ఈ మార్పుల అమలుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Follow Us