Dead Body Parcel Case: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

డెడ్‌బాడీ పార్శిల్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తి కోసం తులసి అనే మహిళను భయపెట్టేందుకు శ్రీధర్‌వర్మ డెడ్‌బాడీ పంపించినట్లు తెలుస్తోంది. ముందుగా మృతదేహం కోసం ప్రయత్నించారని.. అది దొరకకపోవడంతో బర్రె పర్లయ్యను హతమార్చి పార్శిల్ చేసినట్లు సమాచారం.

New Update
dead body parcel case Police arrest two persons

dead body parcel case Police arrest two persons Photograph: (dead body parcel case Police arrest two persons)

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన తులసి అనే మహిళకు ఇటీవల వచ్చిన డెడ్ బాడీ పార్శిల్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సినిమాను తలపించే సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్వి్స్టులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Also Read: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం

ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీ పంపించింది ఎవరు?, ఎందుకు పంపించాడు?, ఇంతకీ ఆ మృతదేహం ఎవరిది?, ఇందులో ఎవరెవరు ఉన్నారు? అనే సందేహం అందరిలోనూ ఉండేది. అది రీసెంట్‌గా తీరిపోయింది. తులసి మరిది శ్రీధర్ వర్మ ఆ డెడ్ బాడీని పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు శ్రీధర్ వర్మతో పాటు అతడికి సహకరించిన మరో మహిళను సైతం అదుపులోకి తీసుకున్నారు. అయితే తులసి ఆస్తిపై కన్నేసిన శ్రీధర్ వర్మ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం

జులై నుంచే ప్రణాళికలు

ఇక ఆ డెడ్ బాడీ చెపల చెరువు మీద రోజు కూలీగా పనిచేస్తున్న బర్రె పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. అయితే అతడినే ఎందుకు శ్రీధర్ వర్మ చంపాడు? అనేది తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీధర్ వర్మ తన వదిన తులసి ఆస్తి కొట్టేందుకు దాదాపు జులై నుంచే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

Also Read: ఇద్దరు మేనేజర్లను తొలగించిన చిరంజీవి.. అసలేం జరుగుతోంది?

డెడ్ బాడీ కోసం ప్రయత్నం

ఇందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ తన వదిన తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ అందిస్తున్నట్లు కథ నడిపించాడు. అదే సమయంలో మెటీరియల్స్ పేరుతో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని భావించినట్లు తెలుస్తోంది. దీంతో మొదట ఎక్కడ నుంచైనా శవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను చంపేశారని తెలుస్తోంది.

Also Read: భార్యను చూసుకునేందుకు రిటైర్మెంట్‌ తీసుకున్న భర్త.. చివరికి ఊహించని షాక్

 ముందుగా అతడిని కారులో ఎక్కించుకుని పెదపుల్లేరు దారిలో వెళ్లి.. అక్కడ మార్గ మధ్యంలోనే పర్లయ్యను కారులో హత్య చేశారని తెలుస్తోంది. అయితే పర్లయ్యను డిసెంబర్ 17న హత్య చేయగా.. ఆ శవాన్ని 19వ తేదీ వరకు ఎక్కడ దాచారు?.. తులసికి శవంతో భయపెడితే వచ్చే ఆస్తిని ఎవరెవరు పెంచుకోవాలనుకున్నారు?.. ఇందులో ఇంకెవరు ప్రమేయం ఉందా? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు