Tirupati Stampede: తప్పు జరిగింది.. క్షమించండి: తిరుపతిలో పవన్ ఎమోషనల్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ఆవేదన చెందారు. తప్పు జరిగింది.. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా అని తెలిపారు. ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదని పేర్కొన్నారు. టీటీడీ, ఇంత మంది సిబ్బంది ఉన్నా ఈ ఘటన జరగటం బాధాకరం అని చెప్పుకొచ్చారు.

New Update

తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాట ప్రాంతానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఈ మేరకు తిరుపతి బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్‌ను పరిశీలించారు. తొక్కిసలాటకు గల కారణాలను పవన్ తెలుసుకున్నారు. అనంతరం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ పరామర్శించారు. అనంతరం టీటీడీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. 

ఈ ఘటన ఆవేదన కలిగించింది

ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

ఈ ఘటన తనను చాలా ఆవేదన కలిగించింది అని అన్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారని.. ఇది దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం అని తెలిపారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అనంతరం తప్పు జరిగింది.. మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి క్షమాపణ కోరుతున్నా అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు.. అదీ ఇప్పుడు టీటీడీ, ఇంత మంది సిబ్బంది ఉన్నా ఈ ఘటన జరగటం చాలా బాధాకరం అని తెలిపారు.

పోలీసులు ఇంకా మారలేదు

బాధితుల బాధ వర్ణనతీతంగా చెప్పుకొచ్చారు. టీటీడీ ఈవో, ఎఈవో, పోలీసులు బాధ్యత తీసుకోవాలి అని తెలిపారు. తాను మాట్లాడి బాధ్యత తీసుకున్నాక పోలీసులు స్పందిస్తున్నారు అని అన్నారు. దీనిపై శ్యామలరావు, వెంకయ్య చౌదరి బాధ్యత తీసుకోవాలి అని చెప్పారు. పోలీసులు ఇంకా మారలేదని మండి పడ్డారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలన్నారు. సీఎం, తాను వస్తే కానీ స్పందించక పోవడం సరికాదన్నారు. నలిగిపొతే కొందరు పోలీసులు రక్షించారని.. మరికొందరు పట్టించుకోకపోవడంతో పాటు నవ్వుతూ ఉన్నారని తెలిపారు. 

ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం

చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్ధిక సాయం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ బోర్డు వీఐపీలకు కాదని.. భక్తులకు ప్రాధాన్యత కల్పించాలి అని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటన జరగకుండా చూస్తాం అని తెలిపారు. దీనిపై ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని అన్నారు. ఇంత మంది పోలీస్ అధికారులు బలగాలతో బందోబస్త్ చేసినా ఘటన జరగడం బాధాకరం అని.. ఇక్కడ నిర్లక్ష్యం వహించారని స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఎవరూ తప్పించుకోవద్దని అన్నారు. ఈవో, ఎఈవో, టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

వీఐపీ ఆటిట్యూడ్ మానెయ్యండి

వ్యక్తులు చేసే తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయి అని తెలిపారు. వీఐపీ ఆటిట్యూడ్ మానెయ్యండి అని హెచ్చరించారు. సామాన్య భక్తులు దర్శించుకొని సవ్యంగా ఇంటికి వెళ్ళాలన్నారు. టీటీడీ చైర్మన్ కూడా మేలుకోవాలి అని అన్నారు. మీరు కూడా వెళ్లి పరామర్శించాలని.. గాయపడ్డ వారు కోలుకున్నాక దైవ దర్శనం చేయిస్తాం అని తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదని చెప్పారు. కొంతమంది కావాలని చేశారని చెబుతున్నారని.. ఘటనపై లోతుగా విచారణ చేసి బాద్యులను శిక్షిస్తాం అని పేర్కొన్నారు. 

ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

గాడిలో పెట్టే ప్రయత్నం

ప్రాధమికంగా టీటీడీకి పాలక మండలికి మధ్య బేధాప్రాయాలు ఉన్నట్లు తెలుస్తుందని.. దీన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాం అని అన్నారు. పోలీసులు పూర్తిగా విఫలం చెందారని తన పర్యటనతో అర్ధమైందని తెలిపారు. డీజీపీని కలిసి.. పరిస్థితి వివరిస్తా అన్నారు. ఇక పవన్ మీడియాతో మాట్లాడేంత వరకు వైఎస్ జగన్ ను నిలిపివేశారు. దీంతో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు వెల్లువెత్తాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు