నాగబాబుకు మంత్రి పదవి.. కేటాయించే శాఖ ఇదే, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రీసెంట్‌గా ప్రకటించారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

New Update
Naga Babu : న్యూటన్‌ నియమాలతో చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగబాబు!

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రీసెంట్‌గా ప్రకటించారు. జనసేన తరఫున నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. అయితే నాగబాబుకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలను మంత్రులకు కేటాయించింది. ఇప్పుడు సీఎం వద్ద శాఖలేవి లేవు. దీంతో నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. నాగబాబు కేబినెట్ లో చేరడం వల్ల పలువురు మంత్రుల శాఖల్లో ఛేంజెస్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

నాగబాబుకు కేటాయించే శాఖ ఇదే

ముఖ్యంగా నాగబాబు సినీ రంగం నుంచి వచ్చారు. ఆయనకు సినీరంగంపై మంచి పట్టు ఉంది. పలువురి సినీ ప్రముఖులతో మంచి స్నేహసంబంధాలు సైతం ఉన్నాయి. సినిమాపై మంచి అవగాహన ఉంది. అందువల్ల ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

ఎందుకంటే ఇప్పటికే జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ వద్ద పలు శాఖలు ఉన్నాయి. అలాగే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు చంద్రబాబు కేబినెట్ లో కొనసాగుతున్నారు. వీరిలో కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ, టూరిజం శాఖలు చూసుకుంటున్నారు. దీంతో మంత్రుల శాఖలను మర్చకుండా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటే మాత్రం.. కందుల దుర్గేష్ కు టూరిజం శాఖ అప్పగించి.. సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు