Ap: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో అక్టోబర్ 16వ తేదీ నుంచి 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయం తెలుస్తుంది. అయితే, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కేవలం 55 రోజుల్లో 4వేల 677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి. 19 లక్షల 33వేల కేసుల బీర్లు విక్రయించినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్...క్రిస్మస్,సంక్రాంతి కానుకలు! కాగా, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించగా.. వాటికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రైవేట్ లిక్కర్ షాపులకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3,300 లిక్కర్ షాపులు ఏర్పాటు అయిన విషయం విదితమే..వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీవ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి.. ఆ సమయంలో అనేక బ్రాండ్లు అందుబాటులో లేవని విమర్శలు వచ్చాయి. Also Read: Ap Rains: ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేస్తూ వాటిని ప్రైవేటు వారికి టెండర్ల రూపంలో ఇచ్చేలాగా నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం చేకూరడంతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు చేపట్టడానికి రాష్ట్రంలో అవకాశం లభించింది మద్యం దుకాణాల కోసం టెండర్లను పిలవగా భారీగా రెస్పాన్స్ వచ్చింది. Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ మొత్తం 3300 కి పైగా దుకాణాలను టెండర్ల రూపంలో కేటాయించ టంతో ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది అక్టోబర్ 16వ తేదీ నుంచి మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి.. నిబంధన ప్రకారం షాపుల ఏర్పాటు చేయటంలో పాటు విధంగా కొందరు రాజకీయ నేతలు ఒత్తిడితో ఆలస్యంగా ప్రారంభమైన మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి ఇప్పటికే కమిషన్ అంశానికి సంబంధించి 20 శాతం కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులు కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. Also Read: TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే! 20 శాతం ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం దుకాణాలు టెండర్లు పాడుకున్న యజమానులు చెబుతున్నారు ఈ అంశం చర్చలో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది ఏపీ వ్యాప్తంగా అటు మద్యం దుకాణాలు బార్లలో కలిపి అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు 4677 కోట్ల ఆదాయం వచ్చింది. 6163508 మద్యం కేసులు,1933560 కేసులు బీర్లు అమ్మకాలు జరిగాయి.