తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. చలికాలం అందులోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగానే తరలి వచ్చారు. 2025 జనవరి 07వ తేదీ మంగళవారం రోజున శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. లడ్డూ తయారీ కేంద్రాల వద్ద, అన్న ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా శ్వాస సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న కంపార్ట్‌మెంట్లలో డాక్టర్లను అందుబాటులో ఉంచారు. Also Read : దేశంలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్ Also Read : శ్రీకాకుళానికి 6 స్పెషల్ ట్రైన్స్.. ఎప్పట్నుంచంటే? హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు ఇక ఇదిలావుండగా.. నిన్న అంటే సోమవారం రోజున 54 వేల180 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 17 వేల 689 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక తిరుమల వైకుంఠ ద్వార దర్శనం జనవరి10 వ తేదీ నుంచి మొదలుకానుంది. 19వ తేదీ వరకు కొనసాగనుంది. దీంతో తిరుమలలో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇతర చిరుతిండ్ల దుకాణాల యజమానులతో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి భేటీ అయ్యారు. భక్తులకు ఆహారాన్ని అందించడంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. Also Read : భీకర మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ! Also Read : మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే!