Dana Cyclone: ఏపీపై దానా తుపాన్‌ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపాన్‌ గా బలపడి హబాలికాతి నేచర్‌ క్యాంప్‌-ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. రాబోయే మూడురోజుల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

New Update
rains 2

Ap: వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపాన్‌ గా బలపడి హబాలికాతి నేచర్‌ క్యాంప్‌-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ తుపాన్‌  గురువారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుంచి తెల్లవారుజాము 3:30గంటల మధ్య తీరం దాటింది. ఇది పశ్చిమ-వాయువ్యదిశగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం వరకు క్రమంగా బలహీన పడే అవకాశాలున్నాయన్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై తుపాన్ ప్రభావం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గురువారం రాత్రి 9 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో తేలికపాటి జల్లులు తప్పా ఎక్కడా కూడా వానలు పడలేదు. మరోవైపు రాబోయే మూడురోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 

Also Read:  ఇంటి కంటే ఆఫీసే పదిలం..సర్వేలో బయటపడ్డ నిజాలు

సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు అనంతపురం జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల దెబ్బకు పలు కాలనీలు మునిగిపోయాయి. వరద దెబ్బకు రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. అలాగే అనంతపురంలోని పండమేరు వంకకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది.

Also Read:  కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..మహారాష్ట్రలో పోటీకి సిద్ధం

400 రైలు సర్వీసులను..

మరోవైపు దానా తుపాన్  ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు భద్రక్, కేంద్రపడ, బాలేశ్వర్, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలను ఈరోజు ఉదయం వరకు మూసివేశారు. గురువారం పశ్చిమబెంగాల్‌లో భారీవర్షాలతో ఈదురుగాలులు వీచాయి. ఈ తుపాన్ ప్రభావంతో రైళ్లు కూడా రద్దు చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు సుమారు 400 రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.

Also Read:  ఉద్యోగులకు రేవంత్ సర్కార్ దీపావళి శుభవార్త!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు