AP News: ఏపీలో అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య కలకలం రేపింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంటలో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి అప్పుల బాధతో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలకు ఉరి వేశాడు.. పిల్లల ప్రాణాలు కోల్పోయిన తర్వాత రైతు కూడా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే .. సొంత పొలంతో పాటుగా కౌలుకు భూమిని తీసుకుని పంటలు సాగు చేశారు. కానీ పంట దిగుబడి సరిగా లేదు. దీంతో అప్పులు కూడా ఎక్కువగా పెరగటంతో బాధ తాళలేక ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. రైతు నాగేంద్ర చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం రాకపోగా.. అప్పుల భారం అధికంగా పెరిగింది. ప్రాణాలు తీసిన అప్పులు: నాగేంద్ర పొలంలో పంటల సాగుకు పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. నాలుగేళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడులు రాకపోవడంతో నష్టాల పాలయ్యారు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో ఒత్తిడి పెరిగింది. నాగేంద్ర సంవత్సరం క్రితం ట్రాక్టరును కొన్నారు. దీనికి ప్రతి నెలా ఈఎంఐ కడుతున్నారు. ఇలా 20 లక్షల వరకు అప్పులు కావడం.. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి ఎక్కువగా పెరగడంతో నాగేంద్రకు ఏం చేయాలో తెలియలేదు. మళ్లీ ఈ ఏడాది 13 ఎకరాల్లో కొర్ర పంటను సాగు చేసినా దిగుబడి సరిగా లేకపోవడంతో నిరాశ చెందాడు. అన్ని విధాలుగా అప్పుల బాధ పెరగడంతో నాగేంద్ర మనస్తాపానికి గురయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లో భార్య వాణి, కుమార్తె గాయత్రి, కుమారుడు భార్గవ్‌ను రాత్రి 9 గంటల సమయంలో తోటలోకి తీసుకెళ్లారు. భార్యకు, పిల్లలకు ఉరి వేసి, తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు సంఘటనా స్థలం దగ్గర ఉన్న ఆనవాళ్లను బట్టి స్థానిక ప్రజలు భావిస్తున్నారు. రైతు కుటుంబం ఇంటి దగ్గర లేని విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. అనుమానం వచ్చి తోట వద్దకు వెళ్లి చూడగా విషయం తెలిసింది. నలుగు మృతదేహాలకు చేసిన గ్రామస్థులు కరుకు పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఊరిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చిన చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం..ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృత్యువాత