BIG Breaking : బిగ్ షాక్ ..  విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి  బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.  కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ నెల 6 తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

New Update
ed sai

ed sai Photograph: (ed sai)

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి  బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది.  కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం.   2025 జనవరి 6 తేదీన ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలోనూ ఈడీ విజయసాయిరెడ్డికి  ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే అప్పుడు పార్లమెంట్ సమావేశాలు  జరుగుతుండటంతో ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు తాజాగా నోటీసులు పంపింది ఈడీ.  అయితే ఇప్పుడైనా విజయసాయిరెడ్డి విచారణకు హాజరు అవుతారా లేదా అన్నది చూడాలి.  ఒకవేళ  విజయసాయిరెడ్డి ఈ సారి హాజరు కాకపోతే ఈడీ అరెస్టులు చేసే అవకాశం లేకపోలేదు. 

కాకినాడ సీపోర్టులో అక్రమాలు 

కాకినాడ సీపోర్టులో కేవీరావు వాటాలను బలవంతంగా లాక్కున్నరంటూ విజయసాయిరెడ్డిపై ఆరోపణలున్నాయి.   కాకినాడ సీపోర్టులో మనీలాండరింగ్‌ అక్రమాలు జరిగినట్టు ఈడీ ప్రాధమికంగా గుర్తించింది.  ఈ వ్యవహారంలో ఇప్పటికే వైసీపీ లీడర్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌ రెడ్డి, అరబిందో’ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డిలకి సైతం ఈడీ నోటీసులు పంపించింది.  అయితే తన ఆరోగ్యం బాలేదంటూ విక్రాంత్‌రెడ్డి  ఈడీకి సమాచారం ఇచ్చి విచారణకు హాజరు కాలేదు.  

కేవీరావు సీఐడీకి ఫిర్యాదు

కాకినాడ సీపోర్టులో తన వాటాలను విజయసాయిరెడ్డి బెదిరించి లాక్కున్నారని కేవీరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో  భారీగా మనీ లాండరింగ్‌ కూడా జరిగినట్లు గుర్తించిన ఈడీ వీరికి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని అదేశించింది.  కాకినాడ పోర్ట్ లోని రూ.2,500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్‌లోని రూ.1,109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

Also Read : శేషాచలం అడవుల్లో విద్యార్థుల మిస్సింగ్..సెల్ ఫోన్ ఆధారంగా గాలింపు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు