Cyber: సైబర్ నేరగాళ్లు మరోసారి అమాయకులను బురిడీ కొట్టించారు. రకరకాల పద్ధత్తుల్లో జనాల సొమ్ము దోచేస్తున్న కేటుగాళ్లు తాజాగా ప్రభుత్వ పథకాల విచారణ పేరుతో లక్షలు నొక్కేశారు. ప్రభుత్వ అధికారులమంటూ సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే బ్యాంక్ ఖాతా ఖాళీ చేశారు. చివరకు విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. అమ్మ ఒడి పేరిట జరిగిన ఈ సంఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Also Read: రైల్వే గుడ్ న్యూస్..ఇక నుంచి ఈ స్టేషన్లలో కూడా ఆ రైళ్లు ఆగుతాయి! మీకు అమ్మ ఒడి వచ్చిందా అంటూ.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున్ కు ఆదివారం మధ్యాహ్నం 9266495107 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. "మీకు అమ్మ ఒడి వచ్చిందా" అంటూ ఆరాతీసి వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. దీంతో వారిద్దరూ తమకు అమ్మ ఒడి రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే మీ వలంటీర్ ఆనంద్‌ను కాన్ఫరెన్స్‌లో తీసుకుంటున్నానంటూ వలంటీర్‌కు కాల్ చేశాడు. ఆనంద్‌తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నామని.. మల్లికార్జున, నాగరాజులకు అమ్మ ఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించి నిజంగానే నమ్మించారు. ఇది కూడా చదవండి: Samantha : 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్ అలాగే మాటాల్లో పెట్టి ఐడీలను అప్‌డేట్ చేస్తామంటూ ఓటీపీలు, పూర్తి వివరాలు తెలుసుకున్నారు. "నీకు పనిచేయడం రాదా" అంటూ వలంటీర్ ఆనంద్ పై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఫోన్ కట్ అవగానే నాగరాజు ఖాతా నుంచి రూ.12,500, మల్లికార్జున అకౌంట్ నుంచి రూ.9 వేలు, వలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి నుంచి రూ.5 వేలు మొత్తం.. రూ.26,500 వారి ఖాతాల నుంచి కాజేశారు. బాధితులు జరిగిన విషయాన్ని గ్రామస్తులతోపాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. Also Read: TTD: తిరుమల సుప్రభాత సేవలో మార్పులు..ఎప్పటి నుంచి అంటే! Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్