BREAKING: మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్!

AP: మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్‌ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్‌ జిలానీ ఆదేశాలు జారీ చేశారు.

New Update
AP: వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు!

Perni Nani: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి ఊహించని షాక్ తగిలింది. ఆయనపై క్రిమినల్ చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. ఆయనకు సంబంధించిన గోదాములో స్టోర్ చేసిన రేషన్ బియ్యం గల్లంతయ్యాయి అని . రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అధికారులు గుర్తించారు. అయితే నానికి సంబంధించిన ఈ గోదాములో  దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీంతో మిస్సైన రేషన్ బియ్యంపై వాస్తవాలను బయటపెట్టేందుకు సమగ్ర విచారణ చేయాలని ఆ సంస్థ ఎండీ మన్‌జీర్‌ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ నాని హస్తంతోనే బియ్యం మాయం అయితే దాదాపు రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతో పాటు నాని క్రిమినల్‌ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 

2020 వైసీపీ ప్రభుత్వ హయాంలో...

2020లో వైసీపీ ప్రభుత్వ హాయంలో మచిలీపట్నంలో ఆనాడు మంత్రి హోదాలో ఉన్న పేర్ని నానికి సంబంధించిన దాదాపు 40 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌరసరఫరాల సంస్థ లీజ్ కు తీసుకుంది. అయితే ఈ స్టోర్ చేసిన బియ్యం, నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం చూసుకుంటోంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌరసరఫరాల సంస్థ చూస్తుంది. కాగా 2020 నుంచి వైసీపీ అధికారం కోల్పోయే దాకా నానికి సంబంధించిన గోదాములో రేషన్ బియ్యం నిల్వలు కొనసాగాయి.

నాని ఏమన్నారంటే?

రేషన్ బియ్యం మాయం అవ్వడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని అన్నారు. దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే జరిగిన లాస్ కు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమని కలెక్టర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు