దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో..తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద ఏపీ సీఎం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో తొక్కిసలాట ఘటనపై రివ్యూ చేసి...అనంతరం రేపు తిరుపతికి వెళ్ళాలని, క్షతగాత్రులను పరామర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఏర్పాట్లపై ఆగ్రహం.. భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు...అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను సిఎం చంద్రబాబు ప్రశ్నించిట్లు తెలుస్తోంది. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి..ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సిఎం ఆదేశాలుజారీ చేశారు. టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలిన టీటీడీ అధికారులకు ఆయన సూచించారు. Also Read: Tirumala Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. TTD చైర్మన్ సంచలన వీడియో!