మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు చేశారు. సీఎం భద్రతను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) గ్రూపులో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాన్ని కూడా జత చేశారు. సీఎంకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), SSG, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ బృందం రక్షణ కల్పించనుంది. ప్రత్యేక రక్షణ బృందం SPG ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నారు. వీరికి స్పెషల్ డ్రెస్ కోడ్‌నూ అమలు చేస్తున్నారు. Also Read : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన జాన్వీ.. అతనితో నిశ్చితార్థం Also Read : నేపాల్ భూకంపానికి చైనా ప్రాజెక్టులే కారణం..! మూడు లేయర్లలో సెటప్ బ్లాక్ కలర్ చొక్కా, డార్క్ బ్రౌన్ కలర్ రంగు ప్యాంటును కమాండోలు ధరిస్తారు. డ్రెస్ ముందు,వెనుక ఎస్‌ఎస్‌జీ అనే అక్షరాలు ఇంగ్లీష్ లో రాసి ఉంటాయి. చంద్రబాబు (Chandrababu) చుట్టూ ఉన్న సెక్యూరిటీ సెటప్ మూడు లేయర్లలో పనిచేస్తుంది. తొలి వలయంలో ఎన్‌ఎస్‌జీ, రెండో వలయంలో ఎస్‌ఎస్‌జీ ఉంటుంది. ఇక సీఎం వివిధ చోట్ల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు మూడో వలయంగా ఉంటాయి. ఏదైనా అముప్పు సంభవించినప్పుడు, NSG , SSG బృందాలు చంద్రబాబును సురక్షిత స్థానాలకు తరలిస్తాయి. 2004లో జరిగిన అలిపిరి సంఘటన మరియు ఆ తర్వాత నక్సల్స్ నుండి పెరిగిన ముప్పును దృష్టిలో ఉంచుకుని తాజాగా సీఎం చంద్రబాబు సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను పర్యవేక్షించే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌కి అదనపు భద్రతను కేటాయించినట్లు సమాచారం. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు ఎక్కువగా జనాల మధ్యే ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో సీఎంకు మావోయిస్టుల (Maoists) నుంచి ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో ఈ యాక్షన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. కుప్పం పర్యటన నుంచి అధికారికంగా కౌంటర్ యాక్షన్ టీం ను సీఎం భద్రతా టీంలోకి చేర్చారు. Also Read : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్స్ రద్దు Also Read : 'కొండ దేవర' సాంగ్ వచ్చేసింది.. దుమ్ములేపిన రామ్ చరణ్