చెప్పిందేంటి? చేస్తున్నదేంటి? పవన్ పై హరిరామజోగయ్య ఫైర్!

కూటమి ప్రభుత్వం గోదావరి జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి సభల్లో గోదావరి జిల్లాల అభివృద్ధిపై ఎక్కువ ఫొకస్ పెడుతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.

New Update

మాజీ హోం మంత్రి చేగొండి హరిరామజోగయ్య మరో సారి కూటమి ప్రభుత్వానికి సంచలన లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వం గోదావరి జిల్లాల అభివృద్ధిని నీరుగార్చిందని ఆరోపించారు. అదే బాటలో కూటమి ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.. అభివృద్ధి పేరుతో రాజధాని ప్రాంతానికే కూటమి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఫైర్ అయ్యారు. వారాహి సభల్లో గోదావరి జిల్లాల అభివృద్ధిపై ఎక్కువ ఫొకస్ పెడుతానని పవన్ కళ్యాణ్ అన్నారని గుర్తు చేశారు. ఎప్పుడు ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నారని.. గోదావరి జిల్లాల అభివృద్ధిని పట్టించుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన!

రోడ్ల పరిస్థితి ఘోరం..

ఈ జిల్లాల్లో రోడ్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్ లో గోదావరి జిల్లాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇది నా మాట కాదు గోదావరి జిల్లా వాసుల మాట అని అన్నారు. నరసాపురం వశిష్ఠ గోదావరి బ్రిడ్జ్ ఉసే లేదన్నారు. అచంట మండలం గోదావరి నదిపై అయోధ్య లంక బ్రిడ్జ్ వేస్తానని సీఎం చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రోడ్డు ఇప్పుడు వేస్తారో? వెయ్యారో? చెప్పాలని డిమాండ్ చేశారు. హరిరామజోగయ్య పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి: మీరసలు పాలకులేనా?.. సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలి: రోజా ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు