Chandrababu: హోం మంత్రి అనితపై చంద్రబాబు సంచలన కామెంట్స్!

సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

New Update
AP Politics

సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు తళ్లాయపల్లిలో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్!

పవన్ కుమార్తెలపై కూడా పోస్టులు..

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చివరికి పవన్ కళ్యాణ్ కుమార్తెల మీద పోస్టింగ్ లు పెడితే.. వారు బాధపడే పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా వద్ద అని అన్నారు. గతంలో వైఎస్ వివేకాను హత్య చేసి గుండెపోటు అంటే మొదట తాను కూడా నమ్మానన్నారు. అయితే.. పోస్ట్ మార్టం చేశాక చూస్తే భయంకరంగా చేసిన హత్య అది అని తేలిందన్నారు. తర్వాత ఆ హత్యను తనపై నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: AP: విడదల రజనిపై అసభ్యకర పోస్టులు.. లోకేష్, పవన్ పై అంబటి ఆరోపణలు!

ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..

అత్యాచారాలు చేస్తున్న వారిని ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. పోలీసులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ తో ఉండాలన్నారు. నేరస్తులది అప్పర్ హ్యాండ్ ఉంటే మీరు కింద ఉండడం మంచిది కాదన్నారు. వైసీపీ నాయకులు తీరు మార్చుకోవాలని సూచించారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాజకీయాలు రాజకీయంగా చేయాలన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే సహించనని స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు