Breaking News :  ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్స్ రద్దు

ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లుగా ఆ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను తొలగిస్తామని వెల్లడించారు. సెంకడియర్ పరీక్షలను బోర్డు నిర్వహించనుంది.

New Update
ap inter

ap inter Photograph: (ap inter)

ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  ఇంటర్‌ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్లుగా ఆ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు.  సంస్కరణల్లో భాగంగా ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను తొలగిస్తామని వెల్లడించారు.  ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ను ఆయా కాలేజీలు ఇంటర్నల్ గా నిర్వహిస్తాయని..  బోర్డు మాత్రం  సెంకడియర్ పరీక్షలను నిర్వహిస్తుందని కృతికా శుక్లా స్పష్టం చేశారు.  

ఇక  చాలా ఏళ్లుగా ఇంటర్‌ విద్యలో సంస్కరణలు జరగలేదన్న కృతికా శుక్లా ఇంటర్మీడియట్ సెలబస్ లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు.  గత ఆరు నెలల నుంచి  విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి వస్తున్న ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు కృతికా శుక్లా. ప్రస్తుతం  ఫస్ట్ ఇయర్  సిలబస్  మార్పు పై  దృష్టి  పెట్టామన్నారు.  తెలుగు,  సంస్కృతం, ఉర్దూ  ఏదైనా అప్షన్  తీసుకునే  అవకాశం  విద్యార్థులకు ఉందని తెలిపారు.  CBSE   సిలబస్ ప్రకారం  ప్రస్తుతం  మార్పులు  జరుగుతున్నాయని తెలిపారు.   ఇంటర్ లో చేయబోయే సంస్కరణల గురించి ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు.  2025 జనవరి 26 వరకు ఎవరైనా సరే తమ అభిప్రాయాలను చెప్పవచ్చునని ఆమె తెలిపారు.  అంతేకాకుండా ఇంటర్ లో ఇక నుంచి ఇంటర్నల్ ప్రాక్టికల్ మర్క్స్ ఉంటాయన్నారు. ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులుగా ఇంటర్నల్ గా ఉంటాయని వెల్లడించారు.  

అటు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.   

ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్

మార్చ్ 1  తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ
మార్చ్ 4 ఇంగ్లీష్ 
మార్చ్ 6 మ్యాథ్స్‌ -1, బోటనీ, సివిక్స్
మార్చ్ 8 మ్యాథ్స్‌  -2, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 11 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 13 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 17 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మేథ్స్
మార్చ్ 19 మోడ్రన్ లాంగ్వేజ్, జియాగ్రఫీ

సెంకడియర్ ఎగ్జామ్స్

మార్చ్ 3 తెలుగు లేదా సంస్కృతం లేదా హిందీ
మార్చ్ 5 ఇంగ్లీష్ 
మార్చ్ 7 మ్యాథ్స్‌ 1, బోటనీ, సివిక్స్
మార్చ్ 10 మ్యాథ్స్‌  2, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 12 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 15 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
మార్చ్ 18 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మేథ్స్
మార్చ్ 20 మోడ్రల్ లాంగ్వేజ్, జియాగ్రఫీ

Also Read : ఫుడ్ లవర్స్‌కి అదిరిపోయే శుభవార్త.. కేవలం 15 నిమిషాల్లోనే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు