/rtv/media/media_files/2026/03/20/ys-vijaya-2026-03-20-16-06-02.jpg)
ys vijaya rajashekar reddy
BIG BREAKING : 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే ( combined family assets). అని ఆయన సతీమణి మాజీ ముఖ్యమంత్రి జగన మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక సంచలన అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఇప్పటివరకు- ఆస్తుల పంపకం ఎప్పుడు జరగ లేదు. - అన్ని ఆస్తులను నలుగురు మనుమలుకు సమానంగా పంచాలని వైఎస్సార్ ఉద్దేశ్యం అని ఆమె స్పష్టం చేశారు. - ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమిది అని విజయ తెలిపారు.
- MOUలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ MOU రాశాడన్నారు. (నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్ తో సహా MOUలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే). ఆస్తులు విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను.ఆస్తుల పంపకం జరగ లేదు.- ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్‌కు కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. - నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరు ఎవరు ? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయo. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ వైఎస్ విజయ రాజశేఖర్ పేరుతో ఆమె లేఖ విడుదల చేశారు.
Follow Us