Mexican Actress: మతాచారం పాటించి చనిపోయిన హీరోయిన్

మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ హిరోయిన్ మార్సెలా అల్కాజర్ మతాచారాలను పాటించి చనిపోయింది. దక్షిణ అమెరికా కాంబో అనే కప్ప విషాన్ని తాగింది. మత విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక తిరోగమన వేడుకల్లో పాల్గొని నటి వాంతులు, విరేచనాతో ఆరోగ్యం క్షీణించి చనిపోయింది.

author-image
By K Mohan
New Update
erer

మత విశ్వాసాల ప్రకారం ఆధ్యాత్మిక తిరోగమన వేడుకల్లో పాల్గొన్న నటి దురదృష్టశాత్తువు ప్రాణాలు వదిలింది. కాంబో అనే పిలవబడే ఓ రకమైన విషాన్ని తీసుకోవడం అక్కడి ఆచారం. కాంబో అనే డ్రింక్ విషపూరితమైన అమెజోనియన్ జెయింట్ కోతికప్ప నుంచి తయారు చేస్తారు. దక్షిణ అమెరికాలో హీలర్ ట్రైనింగ్ డిప్లొమా ప్రొగ్రామ్ లో భాగంగా మెక్సికోలో ఒక మత ఆచారప్రకారం తిరోగమన వేడుకను నిర్వహించారు. ఇది ఒక శుద్ధీకరణ కర్మ. మెక్సికన్ షార్ట్ ఫిల్మ్ నటి మార్సెలా అల్కాజర్ రోడ్రిగ్జ్ డిసెంబర్ 1న ఆ వేడుకల్లో పాల్గొంది.

Also Read: BIT Coin: 1,00,000 డాలర్లకు బిట్‌ కాయిన్‌ !

అక్కడ ఆచారం ప్రకారం సెలబ్రేషన్స్ లో ఆమె కాంబో డ్రింక్ తాగింది. తర్వాత ఆమెకు విరేచనాలు, వాంతులు ప్రారంభమై పూర్తిగా మార్సెలా ఆరోగ్యం క్షీణించింది. ఆమె వైద్య చేయించుకోవడానికి నిరాకరించింది. తర్వాత ఆమె ఫ్రెండ్స్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా నటి వినలేదు. మూడు రోజుల తర్వాత చికిత్స పొందుతూ రెడ్ క్రాస్ హాస్పిటల్లో మార్సెలా అల్కాజర్ మరణిచింది.

Also Read: Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి!

ఆమె ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెక్సికన్ నిర్మాణ సంస్థ మాపాచే ఫిల్మ్స్ ఆమెను గుర్తించింది. ఆమెకు మృతి పట్ల సంతాపం తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. మా ప్రియమైన సహోద్యోగి మరియు స్నేహితురాలు మార్సెలా అల్కాజార్ రోడ్రిగ్జ్ మరణానికి మేము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని మాపాచే ఫిల్మ్స్ స్పానిష్ భాషలో పేర్కొంది.

Also Read: IN-SPAC: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

ఇది కూడా చదవండి : ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుంచి పిల్లల ఏడుపులు..ఎందుకంటే



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు