ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఆన్ చేసి. దీనికి భారతదేశంలోనే 550 మిలియన్లకు పైగా వినియోగదారులున్నారు. ఇటీవల వాట్సాప్ ద్వారా డిజిటల్ మోసాలు అనేకం జరుగుతున్నాయి. టెక్నాలజీని వాడుతున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోకపోతే భారీగా నష్టపోతాము. ఎంత జాగ్రత్త వాడినా వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు, ఇతరులు వారి స్వలాభాల కోసం వాట్సాప్ ను యాక్సిస్ చేసి మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రైవసీ అంతా వాట్సాప్ లోనే ఉంటుంది. మీరు వాట్సాప్ కాల్ చేస్తే లేదా రిసీవ్ చేసుకున్నా మీ లొకేషన్ అవతలి వాళ్లు ట్రాక్ చేయోచ్చట. దీంతో మీరు ఎక్కడ ఉన్నారనే విషయం వారికి తెలుస్తోంది. ఇది కూడా చదవండి : PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్ అది అనేక సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఆన్ చేసి ఉంటే మీ లొకేషన్ ను వాట్సాప్ కాల్ ద్వారా ట్రాక్ చేయలేరు. ఈ ఫీచర్ మీ ప్రైవసీకి మరింత సెక్యురిటీని ఇస్తుంది. వాట్సాప్ కాల్ చేసినప్పుడు మీ లొకేషన్ ఇతరులకు తెలియకుండా ఉండాలంటే మీరు ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు మీ ఫోన్‌లో ఇలా సెట్టింగ్‌లను మార్చండి 1. మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.2. స్క్రీన్ పైన రైట్‌సైడ్ టాప్‌లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.3. తర్వాత సెట్టింగ్స్ కు వెళ్లి.. ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేయండి.4. కిందకి స్క్రోల్ చేసి అడ్వాన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. 5. అక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.. అందులో ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ ఆప్షన్ ను యాక్టివేట్ చేయండి. దీని వల్ల మీ IP అడ్రస్ ప్రైవసీగా ఉంటుంది. ఈ సెట్టింగ్స్ ఛేంజ్ చేసుకుంటే మీరు ఎక్కడున్నారో ఇతరులకు కనిపెట్టడం చాలా కష్టం. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు