ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి భారీ వర్ష సూచన, తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర చలి ముప్పు ఉందని వాతావరణం నిపుణులు తెలిపారు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది కూడా చదవండి : స్కూల్ బుక్స్‌పై తెలంగాణ తల్లి ఫొటో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ (బుధవారం) చలి తీవ్రత పెరిగింది. ఇక అన్ సీజనల్ వర్షాలు ముగిసి పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. ఈరోజు నుంచి దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ మొత్తం చలి గజగజ వణికిస్తోంది. ఇప్పటి వరకు చూసిన చలి కంటే ఇకపై తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. తగు జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. ఇది కూడా చదవండి : ఏపీ పై అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! ఏపీలో కూడా కొన్ని చోట్ల చలి తీవ్రత పెరింగింది. ప్రధానంగా తూర్పు , ఈశాన్య దిశల నుంచి ఈదురు గాలులు వీస్తాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రెండు మూడు రోజులు అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గుర్తించ స్థాయికి పడిపోతాయని హెచ్చరించింది. ఈ తీవ్ర అల్పపీడన వ్యవస్థ రాగల 24 గంటలలో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ శ్రీలంక-తమిళనాడు తీరం వైపునకు చేరుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది. Also Read: Ap: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్...క్రిస్మస్,సంక్రాంతి కానుకలు! Also Read: ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు