బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్

బండి సంజయ్ తనకు సోదరుడు లాంటివారని..  తామిద్దరం చాలా క్లోజ్ గా ఉంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాజాగా RTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు.  తామిద్దరం తరుచుగా ఫోన్ లో మాట్లాడుకుంటామన్నారు.

New Update
ponnam  interview with rtv

ponnam interview with rtv Photograph: (ponnam interview with rtv)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనకు సోదరుడు లాంటివారని..  తామిద్దరం చాలా క్లోజ్ గా ఉంటామన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. తాజాగా RTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆంశాలపై సుధీర్ఘంగా మాట్లాడారు.  తామిద్దరం తరుచుగా  ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పొన్నం క్లారిటీ ఇచ్చారు.  ఇద్దరం విద్యార్థి దశ ఉద్యమ నాయుకులమేనని చెప్పుకొచ్చారు.  పార్టీలు వేరు కాబట్టి ఎన్నికల సమయంలో పరస్పర ఆరోపణలు చేసుకోవడం సహజమేనని తెలిపారు.

వంగరలో నవోదయ స్కూల్ 

ఇటీవలే బండి సంజయ్ కు తాను ఫోన్ చేసి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జన్మస్థలమైన వంగరలో నవోదయ స్కూల్ కావాలని అడిగనన్నారు. అందుకు సంజయ్ కూడా సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు.  త్వరలో వంగరలో  నవోదయ స్కూల్ ప్రారంభిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ కు వెళ్లి ఆయనతో చర్చించిన అంశాలపై పొన్నం ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.  

రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయల పరిస్థితులపై పొన్నం స్పందించారు.  తన నియోజకవర్గమైన హుస్నాబాద్ లో ఇచ్చిన హామీలపై జరుగతున్న అభివృద్ధి పనులపై, భవిష్యత్తులో చేయబోయే పనులపై ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంక్రాంతి పండుగ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను మంత్రి పొన్నం ఈ ఇంటర్వ్యూలో వివరించారు.  దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ రేపు (సోమవారం ) RTV లో టెలికాస్ట్ కానుంది.  

Also Read :  ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు