CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్
TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క వివాహం నేడు ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో మహబూబూనగర్ ఎంపీగా తాను భారీ మోజార్టీతో గెలవబోతున్నట్లు ఆర్టీవీతో జోష్యం చెప్పారు. మిగతా అభ్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ఒక డమ్మీ అభ్యర్థి అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన తన గెలుపును ఆపలేరన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మీద ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్నారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డా. మల్లు రవి ఈ రోజు మాజీ ఎంపీ డా. మంద జగన్నాథంను మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గెలుపే లక్ష్యంగా మల్లురవి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరుతున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓ ఇల్లాలు కాబోతుంది. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ఈ వేసవిలోనే దగ్గరి బంధువును పెళ్లాడబోతున్నట్లు సమాచారం.
రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గృహజ్యోతి పథకానికి బ్రేకులు పడ్డాయి. మహబూబ్నగర్ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి అడ్డంకులు ఎదురయ్యాయి. గత నెల 26 నుంచే మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఇక ఇప్పటికే ఎంపీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై వివరణ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్. దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, బీజేపీ చేస్తున్న కుట్రల నుంచి దేశాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు.