నేటితో భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు
తెలంగాణలో ప్రజాసమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర నేటితో ముగియనుంది. అదిలాబాద్ జిల్లాలో మొదలైన ఈ పాదయాత్ర 17 జిల్లాలు, 36 నియోజక వర్గాలు, 1360 కిలోమీటర్లు చుట్టివచ్చి ఖమ్మం చేరుకోనుంది. పాదయాత్రలో భాగంగా.. మంచిర్యాల, జడ్చర్లల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసిన భట్టి.. మూడోసారి నేడు ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో పొంగులేటి, ఆయన అనుచరులు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొనున్నారు. భట్టి పాదయాత్ర అదే సభతో ముగియనుంది.
ఖమ్మంలో జనగర్జన సభకు సర్వసిద్ధం
ఖమ్మం జిల్లా గడ్డపై జనగర్జనకు కాంగ్రెస్ సర్వసన్నద్ధమైంది. నేటి సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ బహిరంగ సభను... పార్టీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. పొంగులేటి పార్టీలో చేరిక, భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త శకం మొదలవడం ఖాయమని టీకాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్కు రాజీనామాలు.. కేసీఆర్‌కు పెద్దషాక్
తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై చాలా ప్రభావం చూపుతుంది. అధికార పార్టీ నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు టీకాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు రాజీనామాలు చేస్తూ కేసీఆర్కుపెద్ద షాకే ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం నేతలు. ఖమ్మం పొంగులేటి సభలో వీరంతా కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు సమాచారం.
రావణాసురుడు కొత్తగూడెంలోనే ఉన్నాడు
డిసెంబర్లోనే తెలంగాణ ఎన్నికలు వస్తుండటంతో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా హాట్ కామెంట్లతో ప్రజల ముందుకు వస్తున్నారు. అయితే బీజేపీలో జితేందర్‌రెడ్డి కామెంట్ దూమారం మర్వక ముందే ఇప్పుడు హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మరో కామెంట్స్ చేసి బీఆర్ఎస్లో దుమారం రేపుతున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ ఎంట్రీ పరంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో చేరికకు ముందు పొంగులేటి సంచలన కామెంట్స్
ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయిన తరువాత పొంగులేటి ఖమ్మం జిల్లాలో మరింత దూకుడు పెంచారు. వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వాణిజ్య వ్యాపారులతో పోంగులేటి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నాలుగేళ్లు గడిచినా.. సింగరేణి ఎన్నికలు లేవు..!
సింగరేణి ఎన్నికలు జరగకుండా తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ప్రయత్నం చేసస్తోంది. మణుగూరు నుండి బెల్లంపల్లి ఏరియా వరకు.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఈసారి కార్మిక సంఘం ఎన్నికల్లో ఓడిపోతామని భయం ప్రభుత్వానికి పట్టుకుందంటున్నారు సింగరేణి నాయకులు.
తుమ్మినందుకే కొడతారా? ఇదెక్కడి పైశాచికానందం..!!
ఖమ్మం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తుమ్మినందుకే ఓ వ్యక్తిని పొట్టు పొట్టుకొట్టారు. మూడనమ్మకాలను నమ్మి సాటి మనిషిని అత్యంత దారుణంగా చితకబాదారు. ఓ శుభకార్యానికి వెళ్తుండగా వ్యక్తి తుమ్మాడని ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో సదరు కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Push-barricades.-warning-to-BRS-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MLA-Podem-Veeraiah-who-was-going-to-Janagarjan-Sabha-was-arrested.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Bhatti-Peoples-March-ends-today.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Khammam-is-all-set-for-a-public-gathering.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Resignations-from-BRS.-Big-shock-for-KCR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Ravanasura-is-in-Kothagudem.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Clear-on-joining-Ponguleti-Congress.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/There-has-been-tremendous-opposition-to-BRS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/A-family-attacked-a-man-in-Khammam-district.webp)