Kishan Reddy: కేసీఆర్ పాలనలో రైతులు గోస పడుతున్నారు
సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్‌పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో కమలనాథులు ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం వేదికగా రైతు గోస-బీజేపీ భరోసా సభ జరుగుతోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకు ఆసక్తిగా ఉంటున్నాయి. తాజాగా తుమ్మల ఎన్నికల పోటీ హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే తేల్చి చెప్పిన తుమ్మల.. ఏం పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది..రాజకీయ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోకి వెళ్తారా?.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? లేక బీజేపీలోకి వెళ్తారా? అనేది తుమ్మల ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
సమయం తక్కువ ఉండటం వల్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రాచలం పర్యటన రద్దు చేసుకున్నారు. విజయవాడ నుంచి నేరుగా భద్రాచలం వచ్చి సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకునేలా షెడ్యూల్ ఖరారైంది. కానీ చివరి నిమిషంలో షా పర్యటన రద్దు అయిందని బీజేపీ యంత్రాంగం ప్రకటించింది.
అసమ్మతినేతలు తమ సత్తా ఏంటో చూపించడానికి కారు దిగి వేరే పార్టీల కండువాలు కప్పుకోవడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే పాలేరు సీటు కోసం పట్టుబట్టిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అందరూ ఊహించినట్టుగానే త్వరలోనే బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.సెప్టెంబర్ 6న ఆయన కాంగ్రెస్ లోకి చేరుతున్నట్టుగా సమాచారం..
ఇంటి ఆవరణంలో ఉన్న కారు ఓ బాలుడ్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కారు ఎక్కి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కారు డోర్ మూసుకుపోంది. ఎవరు చూడక పోవటంతో ఊపిరాడక పార్థు మృతి చెందాడు.
రానున్న ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందుగా 2 వేల కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు దర్శనమివ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన నాయకుడు అమన్ మృతితో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట గ్రామంలో పార్టీ యువనేత అమన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. అమన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద అమన్ కుటుంబానికి షర్మిల 3లక్షలు అందజేశారు.