Allu Arjun: అల్లు అర్జున్ కేసు వివాదం కొనసాగుతున్న వేళ సీపీ సీవీ ఆనంద్ నిర్ణయం హాట్ టాపిక్‌గా మారింది. సంధ్య థియేటర్ ఘటనపై ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు, పోలీసు సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీవీ ఆనంద్ సెలవుపై విదేశాలకు పయణమవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. రేవతి విషాద ఘటనపై ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే సోమవారం ఈ పోలీస్ బాస్ అమెరికాకు బయలు దేరనుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్ తాను ఏ తప్పు చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన సీపీ.. ఆదివారం తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ ఇలాంటి క్లిష్ట సమయంలో ఎందుకు సెలవు పెడుతున్నారనేదానిపై చర్చ నడుస్తోంది. బెయిల్ రద్దు పిటిషన్.. ఈ మేరకు ఈ కేసులో ముద్దాయిగా ఉన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీస్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బన్నీ బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించేందుకు తెలంగాణ హై కోర్టులో ఫిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో సీపీ ఆనంద్ విదేశాలకు వెళ్లనుండటం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఈ కేసును ఇలాగే కొనసాగిస్తారా? లేదంటే ఆయన తిరగొచ్చే వరకు పెండింగ్ లో పెడగతారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసులో సీపీ ఆనంద్ కు ఫుల్ రైట్స్ ఇచ్చిన నేపథ్యంలో ఆనంద్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఆసక్తిరేపుతోంది. అసెంబ్లీలోనూ సీపీ తనకు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చారని సీఎం రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా ఆనంద్ లీవ్ తీసుకోవడంతో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంకెవరికైనా ఈ కేసు బాధ్యతలు అప్పగిస్తారా లేదంటే ఆయన వచ్చే వరకూ నెమ్మదిగా కొనసాగిస్తారా? లేదా కేసులో ఇంకేదైనా కోణం వెతుకుతున్నారా అనేది తెలియాల్సివుంది. ఇది కూడా చదవండి: Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే హైదరాబాద్ ప్రశాంతం.. ఇదిలా ఉంటే.. 2024లో హైదరాబాద్ నగరం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదికపై ఆదివారం సమావేశం నిర్వహించగా.. హైదరాబాద్ కమిషనర్ పరిధిలో అన్ని పండగలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. హోంగార్డు నుంచి సీపీ వరకూ అందరూ కష్టపడ్డారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తి చేశాం. క్రైమ్ రేట్ ఈ సంవత్సరం కొంత పెరిగింది. డయల్ 100కి వస్తున్న ఫిర్యాదులపై స్పందన పెరిగింది. క్రైమ్ జరిగినప్పుడు ఘటనా స్థలానికి 7 నిమిషాల కన్నా తక్కువ సమాయానికే చేరుకుంటున్నాం. రాత్రిపూట గస్తీ పెంచడంతోపాటు 129 పెట్రోల్ కార్స్, 210 బ్లూ కోల్డ్ వాహనాలు, ఇంటర్ సెప్టర్ వాహనాలను కూడా విజిబుల్ పోలీసింగ్ భాగస్వామ్యం చేశామని వివరించారు.