Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి 70 లక్షల మంది ఖాతాల్లో 3,590 కోట్లు

తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేయనున్నారు.

New Update
Rythu Bharosa Funds

Rythu Bharosa Funds

తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా జరిగే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేయనున్నారు.

తొలి విడతలో 70 లక్షల మందికి లబ్ధి
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్ల రూపాయలను బదిలీ చేయనున్నారు. ఈ విడతలో ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులందరికీ ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. చిన్న, సన్నకారు రైతుల సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.

విడతల వారీగా నిధులు
రైతులకు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో నిధులను పంపిణీ చేయాలని సర్కార్ భావిస్తోంది. మొదటి విడత విడుదలైన 20 రోజుల వ్యవధిలోనే మరో 2,650 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి మిగతా రైతు భరోసా నిధులు పూర్తిస్థాయిలో చేరనున్నాయి.

మొత్తంగా ఈ ప్రక్రియ ద్వారా వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం అందుతుండటంతో రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి ఈ పథకానికి సంబంధించి మరిన్ని కీలక వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు