మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానంటూ బాంబు పేల్చారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ ఒక్కడే ప్రస్తుతం పవర్ ఫుల్ లీడర్ అని, ఈ విషయాన్ని తాను రెడ్డి సంఘం మీటింగ్‌లోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంతేకాదు ఎవరు అవునన్నా కాదన్నా.. రేవంత్, నేను అన్నదమ్ములమే అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలతో మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం గట్టిగా సాగుతోంది..
మల్లారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రితో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి మల్లారెడ్డి ఇలా బహిరంగంగా మాట్లాడటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం చిట్‌చాట్ మాత్రమేనా లేక కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు వేస్తున్న పునాదులా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
నాకు విలన్ వేషాలు వద్దు
ఇక రాజకీయాలే కాకుండా సినిమాల గురించి కూడా మల్లారెడ్డి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ తనను అడిగారని, కానీ తాను దానికి నో చెప్పానని మల్లారెడ్డి వెల్లడించారు. నాకు విలన్ వేషాలు వద్దు.. సినిమాలోనైనా సీఎం పాత్ర చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు.
సీఎం రేవంత్ కీలక ప్రకటన
మరోవైపు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు. ఇదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. మెట్రో నగరాల్లో పొల్యూషన్ ,ట్రాఫిక్ తీవ్ర సమస్యలు ఉన్నాయన్న సీఎం... కనీసం పార్కింగ్ సౌకర్యాలు లేక జనాలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. షమీర్ పెట్, మేడ్చల్ వైపు ఎలేవేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా బేగంపేట్ ఎయిర్పోర్ట్ రన్వే కింది నుండి అండర్ పాస్ నిర్మిస్తున్నామని రేవంత్ చెప్పుకొచ్చారు.
Malla Reddy: నేనే రేవంత్ రెడ్డిని సీఎం చేసింది: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని తానే ముఖ్యమంత్రిని చేశానంటూ బాంబు పేల్చారు.
mallareddy-funny